మాయమాటలు చెప్పి బాలికపై వృద్ధుడు అత్యాచారం

గ్రామానికి చెందిన దంపతులు ప్రార్థన మందిరానికి వెళ్లిన సమయంలో వారి ఐదేళ్ల కూతురు రోడ్డు మీద ఆడుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన చెందిన మందా ప్రాన్సిస్(50) ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు.
అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తల్లి ఆమె కోసం వెతుకులాట ప్రారంభించింది. స్థానికులు చెప్పడంతో ప్రాన్సిస్ ఇంటికి వెళ్లింది. కాగా, బాలిక ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చి విషయం చెప్పింది.
మనుమరాలి వయసున్న చిన్నారిపై ఈ దారుణానికి పాల్పడిన ప్రాన్సిస్‌పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు ప్రాన్సిస్‌ను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications