వంట పనుందని తీసుకెళ్లి.. మహిళపై గ్యాంగ్‌రేప్
తూర్పుగోదావరి: జిల్లాలోని రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. వంటపని ఉందని తీసుకెళ్లి.. ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన యువతి మూడు నెలల క్రితం కొవ్వూరుకు చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. బుధవారం రాత్రి భర్తతో గొడవపడి రైలులో రాజమండ్రి గోదావరి స్టేషన్‌కు అర్ధరాత్రి 2గంటల సమయంలో చేరుకుంది. 3గంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చి వంటపని ఉందని రమ్మని తమ వెంట ఆటోలో తీసుకెళ్లారు.

లాలాచెరువు సెంటరు పుంతరోడ్డులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యంమత్తులో ఉన్న ఆ యువకులు అక్కడే పడుకోవడంతో.. గురువారం ఉదయం 7గంటల సమయంలో ఆ యువతి అక్కడ నుంచి లాలాచెరువు సెంటర్ బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడే స్పృహతప్పి పడిపోయింది.
గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయాన్ని ఆమె స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. కేటరింగ్ పనిచేసే యువకుడు, ఆటో డ్రైవరు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications