కాల్ సెంటర్ మహిళా ఉద్యోగిపై గ్యాంగ్ రేప్

కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న 19 ఏళ్ల అమ్మాయిపై బుధవారం తెల్లవారు జామున ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తన స్నేహితురాలి బర్త్ డే పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా, గుర్గావ్ 46వ సెక్టార్ వద్ద ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మెట్రో స్టేషన్ వద్ద దింపుతానని నమ్మించి ప్రధాన నిందితుడు దినేష్ అనే వ్యక్తి బాధితురాలిని బైక్‌పై తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత మరో ఇద్దరితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దినేష్ ఢిల్లీ - గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గల ఝార్సా గ్రామానికి చెందినవాడని జాయింట్ పోలీసు కమిషనర్ మహేశ్వర్ దయాల్ చెప్పారు .
మిగిలిన ఇద్దరు నిందితులను నవీన్, సత్యదేవ్‌లుగా గుర్తించారు. వీరి ముగ్గురి వయస్సు కూడా దాదాపుగా 20 ఏళ్లే ఉంటుందని పోలీసులు అంటున్నారు. దినేష్ ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications