ఫ్యాషన్ డిజైనర్ విద్యార్థినిపై అత్యాచారం, అరెస్టు

ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో గల అతని నివాసంలో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాధితురాలిని అతను మోసం చేశాడని అంటున్నారు. స్నేహితుడైన వైభవ్ జైన్ ఆ యువతిని ఓ హోటల్‌కు తీసుకుని వెళ్లాడు. అక్కడ తనకు మద్యం కలిపిన డ్రింక్స్ తాగించాడని ఆమె ఫిర్యాదు చేసింది. దాంతో తాను స్పృహ తప్పి పడిపోయానని, అప్పుడు అతను తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది.
ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు నిందితుడు జైన్ న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఎయిర్ లైన్ కంపెనీలో క్యాబిన్ క్ర్యూ జాబ్ ఇప్పిస్తానని ఆమెకు అతను ఆశపెట్టినట్లు చెబుతున్నారు.
యువతి భగల్పూర్‌కు చెందింది. తనకు నగరం గురించి బాగా తెలుసునని, ఫ్రెండ్‌తో వసంత్ కుంజ్‌లో ఉంటున్నానని ఆమె చెప్పింది. తనను వైభవ్ శనివారం సాయంత్రం డిస్కోకు తీసుకుని వెళ్లి మద్యం కలిపిన డ్రింక్ తాగించి, ఇంట్లో వదిలేస్తానని చెప్పి అత్యాచారం చేశాడని ఆమె వివరించింది.












Click it and Unblock the Notifications