గర్ల్స్‌పై వార్డెన్ భర్త రేప్: విద్యార్థినిపై ప్రిన్సిపాల్ రేప్

ఈ వసతిగృహం ధనోరా గ్రామంలో ఉందని, నిందితుడు వినోద్ నాగ్ పరారీలో ఉండడంతో సూపరింటిండెంట్ అయిన అతడి భార్య నీతూ నాగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఇంచార్జీ కలెక్టర్ కార్తికేయ గోయల్ చెప్పారు.
వినోద్ నాగ్ తమపై అత్యాచారం చేసినట్లు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆరోపించారని, వాళ్లు ఎంత చెప్పినా సూపరింటిండెంట్ పట్టించుకోలేదని, పైగా కేసును తొక్కేయడానికి ప్రయత్నించారని కలెక్టర్ చెప్పారు.
ఇదిలావుంటే, బాలియాలో ఓ పాఠశాల ప్రిన్సిపాల్ 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఖేజూరిలోని ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రభాను పాశ్వాన్ మూడో తరగిత చదువుతున్న బాలికపై శనివారంనాడు అత్యాచారం చేసినట్లు పోలీసులు సోమవారం చెప్పారు. బాధితురాలి తండ్రి ఆదివారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications