ఉద్యోగినిపై కాల్ సెంటర్ యజమాని, మేనేజర్ రేప్

కాల్ సెంటర్ యజమాని శైలేంద్ర చౌహాన్‌పై ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించినట్లు, దాంతో జిల్లా కోర్టుకు వెళ్లినట్లు ఆ మహిళ చెప్పింది. నోయిడా పోలీసులు చౌహన్‌పై, కంపెనీ మేనేజర్ జగ్జీవన్‌పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు.
తనకు చౌహన్ ముందే తెలుసునని, అతనితో పాటు ఘజియాబాద్ కంపెనీలో పనిచేశానని ఆ మహిళ చెప్పింది. ఉద్యోగం వదిలేసి చౌహాన్ సొంత కాల్ సెంటర్ పెట్టుకున్నాడు. తనతో పాటు పనిచేయాల్సిందిగా నిరుడు మేలో ఆ మహిళను పిలిచాడు.
జులైలో చౌహాన్ తనకు మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయం ఇచ్చాడని, స్పృహ తప్పిన తర్వాత తనపై అత్యాచారం చేశాడని, జగ్‌జీవన్ కూడా తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఉద్యోగం పోతుందనే భయంతో గతంలో తాను ఫిర్యాదు చేయలేదని చెప్పింది. తనను పెళ్లి చేసుకుంటానని చౌహాన్ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని మహిళ చెప్పింది.












Click it and Unblock the Notifications