వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొంచివున్న థర్డ్‌వేవ్ ముప్పు: వైఎస్ జగన్ సహా: 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడిప్పుడే సద్దు మణుగుతోంది. రోజువారీ కేసులు అదుపులోనే ఉంటూ వస్తోన్నాయి. కరోనా వల్ల సంభవించిన మరణాలు కూడా ఇదివరకట్లా ఆందోళన కలిగించే విధంగా నమోదు కావట్లేదు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 38,949 కరోనా కేసులు నమోదయ్యాయి. 542 మంది మరణించారు. 40,026 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు కుదుటపడ్డాయనుకుంటోన్న ఈ దశలో థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలు ఆందోళనను కలిగిస్తోన్నాయి.

Mangli: దుప్పటి కప్పుకొని ఇంట్ల పండుకో: సీమ బిడ్డకు తెలంగాణ ఏం తెలుసు: మైసమ్మ పాటపై దుమారంMangli: దుప్పటి కప్పుకొని ఇంట్ల పండుకో: సీమ బిడ్డకు తెలంగాణ ఏం తెలుసు: మైసమ్మ పాటపై దుమారం

కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతోండటం పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఏపీ సహా ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో సంప్రదింపులు నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రులు వైఎస్ జగన్-ఏపీ, ఎంకే స్టాలిన్-తమిళనాడు, పినరయి విజయన్-కేరళ, బీఎస్ యడియూరప్ప-కర్ణాటక, నవీన్ పట్నాయక్-ఒడిశా, ఉద్ధవ్ థాకరే-మహారాష్ట్ర ఇందులో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనికి హాజరయ్యారు.

 PM Modi holds meeting with CMs including APs YS Jagan on possible 3rd wave of Covid

థర్డ్‌వేవ్ ముప్పును ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ప్రధాని వారికి సూచించారు. మొత్తం కేసుల్లో 80 శాతం వాటా ఆయా రాష్ట్రాల నుంచే వెలుగులోకి వచ్చినందున ఈ సారి ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సిన్.. ఈ నాలుగు అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. అత్యధిక పాజిటివిటీగా ఉన్న ఈ రాష్ట్రాల్లో టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సిన్‌ను ముమ్మరం చేయడం ద్వారా రోజువారీ కేసులను నియంత్రించాలని చెప్పారు.

Recommended Video

Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu

ప్రత్యేకించి- మహారాష్ట్ర, కేరళల్లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతోన్నాయని, తక్షణమే వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా కేసుల పెరుగుదలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, దీనికి సంబంధించిన పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా వైరస్ తీవ్రత ఇదివరకు ఎక్కడ ఆరంభమైందో.. మళ్లీ అక్కడికే వచ్చి చేరే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.

English summary
PM Modi holds meeting with CMs of Tamil Nadu, Andhra Pradesh, Karnataka, Odisha, Maharashtra, Kerala on Covid19 situation. We are at a point where there are talks about a possible 3rd wave of Covid19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X