GRT Jewellers: జీఆర్‌టీ జ్యువెలర్స్‌లో డైమండ్ ఫెస్టివల్...కళ్లు చెదిరే డిజైన్స్..!!

జీఆర్‌టీ జ్యువెలర్స్ కళ్లు చెదిరేలా మిరుమిట్లు గొలిపే డైమండ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. ఎన్నో అద్భుతైన డైమండ్ డిజైన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.1964లో ప్రారంభమైన GRT జ్యువెలర్స్ ఆభరణ ప్రియులను ఆకట్టుకుంది. వజ్రాల విషయానికొస్తే స్వచ్ఛత, నాణ్యతతో కూడి నెంబర్‌ వన్ క్వాలిటీ వజ్రాలన కస్టమర్లకు దశాబ్దాలుగా అందిస్తోంది. కస్టమర్ల విశ్వాసాన్ని నమ్మకాన్ని GRT జ్యువెలర్స్ చూరగొంది. 60 సంవత్సరాలుగా జ్యువెలరీ మార్కెట్‌ను శాసిస్తూ దక్షిణ భారతంలోనే ప్రధాన ఆభరణాల దుకాణంగా GRT జ్యువెలర్స్ నిలబడింది.

ఇక ఆభరణ ప్రియుల కోసం జీఆర్‌టీ జ్యువెలర్స్ డైమండ్ ఫెస్టివల్‌ను ఆవిష్కరించింది. అత్యాధునిక డిజైన్లు కలిగిన డైమండ్ జ్యువెలరీ ఇక్కడ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.ఇక హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.డైమండ్ & అన్‌కట్ డైమండ్ ఆభరణాలపై 25శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతోంది.ప్లాటినం ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 30శాతం వరకు డిస్కౌంట్ పొందండి.ఈ ప్రత్యేకమైన ఆఫర్లు ఒరియానా లైట్ వెయిట్ డైమండ్ ఆభరణాలకు సైతం వర్తిస్తాయి.

GRT Jewellers unviels Diamond festival thanks customers for showing faith in their products

GRT జ్యువెలర్స్‌లో కొనుగోలు చేసిన అన్ని డైమండ్ ఆభరణాలపై GRT డైమండ్ అష్యూరెన్స్ పారదర్శకతను నిర్థారిస్తుంది. కస్టమర్ ఒక ఆభరణ కొనుగోలు చేశాడంటే దానికి సంబంధించిన అన్ని అంశాలు చాలా పారదర్శకంగా ఉంటాయి. ప్రతి ఆభరణంలో ధృవీకరించబడిన నాణ్యమైన వజ్రాలతో పొదిగారా లేదా, ఖచ్చితమైన బరువు, ఆ బరువుకు అనుగుణంగా ఉన్న ధర,జీవితకాల నిర్వహణ, క్యారెట్ గ్యారెంటీ,HUID గుర్తుతో పాటు బైబ్యాక్ హామీతో ఈ ఆభరణాలు వస్తాయి.ఒక ఆభరణం కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌కు ఎక్కడా ఎలాంటి అనుమానం రాకూడదనే ఈ పారదర్శకతను మెయిన్‌టెయిన్ చేయడం జరుగుతోంది.అంత ధర దేనికి చెల్లిస్తున్నారో తెలుసుకునేలా అన్ని అంశాలు సవివరంగా ఉంటాయి.

తాము అత్యుత్తమ వజ్రాభరణాలను అత్యంత ఖచ్చితత్వంతో డెలివరీ చేసేందుకు అత్యాధునిక సాంకేతికత,ఉత్తమ పరిశ్రమ పద్ధతులను పాటిస్తామని GRT జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ చెప్పారు.కస్టమర్ నమ్మకాన్ని చూరగొనేందుకు ప్రతి వజ్రం మూలం నుంచి అది వజ్రాభరణం రూపంలో తుది దశకు వచ్చేవరకు ప్రతి అంశాన్ని తెలియజేస్తామని అన్నారు.ఈ ప్రక్రియను చాలా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

వజ్రాలు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయని చెప్పారు GRT జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ రాధాకృష్ణన్. ఈ వజ్రాలు తరతరాలుగా వారసత్వంగా అందిచబడుతున్నాయని అభిప్రాయపడ్డారు.తమ వజ్రాలపై అత్యంత విశ్వసనీయతను, నమ్మకాన్ని కనబరుస్తున్న కస్టమర్లే తమకు స్ఫూర్తి అని రాధాకృష్ణన్ చెప్పారు. ఇక అత్యున్నత స్థాయి ప్రమాణాలు, విలువలు, పారదర్శకతను కొనసాగించడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+