కొత్త వ్యాపారంలోకి షారుక్ ఖాన్.. ఏంటో తెలుసా..?
మద్యం ఉత్పత్తి సంస్థ రాడికో ఖైతాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, ఆయన కుమారుడు ఆర్యన్, జీరోధా బ్రోకరేజ్ సంస్థకు చెందిన నిఖిల్ కామత్ లతో కలిసి "డి'యావోల్ స్పిరిట్స్" అనే కొత్త వ్యాపారాన్ని ప్రకటించినట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యంలో రాడికో ఖైతాన్ అతిపెద్ద వాటాదారుగా ఉండనుంది.
డి'యావోల్ బీవీ, డి'యావోల్ ఇండియా సంస్థల్లో 47.5 శాతం వాటా కోసం రాడికో ఖైతాన్ రూ. 40 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈమేరకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. షారుక్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ తో కలిసి డి'యావోల్ ను ఒక లగ్జరీ బ్రాండ్ గా గతంలో ప్రారంభించారు. ఇప్పుడు రాడికో సంస్థ సహకారంతో దీనిని మరింత విస్తరించనున్నారు. దీనిలో భాగంగా మొదటి ఉత్పత్తిగా ప్రీమియం టేకిలాను విడుదల చేయనుంది.

ఈ మేరకు రాడికో ఖైతాన్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ ఖైతాన్ ఈ భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. లగ్జరీ స్పిరిట్స్ విభాగంలో తమ సంస్థకు ఇది దీర్ఘకాలిక పెట్టుబడి అని తెలిపారు. మరోవైపు ఈ భాగస్వామ్యం "సముచితమైన, భవిష్యత్- ఆధారిత" ఉత్పత్తిని సృష్టించడంలో సహాయపడుతుందని షారుక్ ఖాన్ పేర్కొన్నారు. ఈ బ్రాండ్ "సంస్కృతిలో జీవించడం" అనే బ్రాండ్ గా మారడమే తమ ఆశయం అని ఆర్యన్ ఖాన్ వివరించారు. ఈ మేరకు నిఖిల్ కామత్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడడమే తమ బ్రాండ్ లక్ష్యమని, ప్రీమియం ఆల్కహాల్ ఇకపై ఒకే ప్రాంతానికి చెందినది కాదని తెలిపారు.












Click it and Unblock the Notifications