ఎయిర్ ఇండియా 2021లో అమెరికా... డిఫెన్స్ రంగంలో ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం
బెంగళూరు: ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బెంగళూరు వేదికగా ఏరో ఇండియా 2021 కార్యక్రమం జరుగనుంది. ఈ వేడుకలో అమెరికా కూడా పాల్గొననుంది. అమెరికా చార్జ్డ్ వ్యవహారాల శాఖ అధికారి డాన్ హెఫ్లిన్ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు బృందంతో పాటు రక్షణ రంగంకు సంబంధించిన ప్రతినిధులు ఏరో ఇండియా 2021 కార్యక్రమంకు హాజరు కానున్నారు.
ఈ ఏడాది ఏరో ఇండియా షోకు అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించడంపై హర్షం వ్యక్తం చేశారు హెఫ్లిన్. రక్షణ రంగంలో భారత్ అమెరికా దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని హెఫ్లిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు అమెరికా రక్షణ రంగంలో భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని ఆయన గుర్తుచేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా - భారత్ దేశాల మధ్య రక్షణ రంగంలో ద్వైపాక్షిక బంధాలు మరింత దృఢంగా మారడంలో ఏరో ఇండియా 2021 షో కీలకంగా మారుతుందని చెప్పారు.

ఏరో ఇండియా 2021 అమెరికా పారిశ్రామిక రంగంకు, అమెరికా మిలటరీ సర్వీసెస్‌కు చక్కటి అవకాశాన్ని అందిస్తోందని హెఫ్లిన్ చెప్పారు. రెండు దేశాల మిలటరీ బందాలు బలోపేతం కావడమే కాకుండా రక్షణ రంగంలో పరస్పర సహకారం కూడా పెంపొందేందుకు దోహద పడుతుంది.ఇండో-పసఫిక్ ప్రాంతంలో రెండు దేశాల మిలటరీలు ఎక్కడే కానీ నిబంధనలు అతిక్రమించకుండా అంతర్జాతీయ ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు వెళతాయని హెఫ్లిన్ చెప్పారు. ఏరో ఇండియా 2021లో అమెరికా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు పాల్గొనడం ద్వారా అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అనే సంకేతాలు ప్రపంచ దేశాలకు పంపుతోందని హెఫ్లిన్ అన్నారు.
ఇక అమెరికా ప్రభుత్వం నుంచి ప్రతినిధుల బృందం ఇలా ఉంది
డాన్ హెఫ్లిన్, అమెరికా చార్జ్‌డ్ అఫెయిర్స్
కెల్లి ఎల్ సేబోల్ట్, ఎయిర్‌ఫోర్స్ డిప్యూటీ అండర్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ అఫెయిర్స్
లెఫ్ట్‌నెంట్ జనరల్ డేవిడ్ ఏ .కృమ్ 11వ ఎయిర్‌ఫోర్స్ కమాండర్
మేజర్ జనరల్ మార్క్ ఈ. వెథరింగ్టన్, 8వ ఎయిర్‌ఫోర్స్ కమాండర్
బ్రిగేడియర్ జనరల్ బ్రియాన్ బ్రక్‌బార్, ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అండ్ కోఆపరేషన్ డైరెక్టొరేట్ డైరెక్టర్
జూడిత్ రవిన్, చెన్నైలోని యూఎస్ కాన్సుల్ జనరల్
ఐలీన్ నంది, కమర్షియల్ అఫెయిర్స్ మినిస్టర్ కౌన్సెలర్ , యూఎస్ కమర్షియల్ సర్వీస్
రియర్ అడ్మిరల్ ఐలీన్ లాబాచర్, డిఫెన్స్ అటాచ్ యూఎస్ ఎంబసీ, నూఢిల్లీ
ఇక ఏరో ఇండియా షోలో అమెరికాకు చెందిన పలు ప్రముఖ డిఫెన్స్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందులో ఏరోస్పేస్ క్వాలిటీ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎల్ఎల్‌సీ, ఎయిర్‌బోర్న్ ఐఎన్‌సీ, బోయింగ్, ఐఈహెచ్ కార్పొరేషన్, జీఈ ఏవియేషన్, జనరల్ అటామిక్స్, హైటెక్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్, L3 హ్యారిస్, లావర్‌సాబ్ ఇ:డియా, లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్, ట్రక్క సిస్టమ్స్ పాల్గొంటున్నాయి.
ఇక షోలో బీ-1బీ లాన్సర్ హెవీ బాంబర్ ఫ్లై బై ప్రదర్శన ఇవ్వనుంది. అమెరికాలోని తన బేస్ నుంచి ఎన్నో ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయి ఈ బీ-1బీ లాన్సర్ సూపర్ సానిక్ హెవీ బాంబర్లు. ఇవి పెద్ద ఎత్తున పేలుడు సామగ్రిని, ఆయుధాలను మోసుకెళ్లగలవు. అమెరికా మిలటరీలో ఈ తరహా సూపర్ సానిక్ బాంబర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కోవిడ్ -19 నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ ప్రతినిధుల బృందం భారత్ అమెరికా ప్రొటోకాల్స్ ప్రకారం నడుచుకుంటారు. భారత్‌కు వచ్చే 72 గంటల ముందు కోవిడ్ టెస్టులు చేయించుకుని నెగిటివ్ వచ్చాకే అక్కడి నుంచి భారత్‌కు బయలుదేరుతారు.ఇక షో నిర్వాహకులు పొందుపర్చిన మార్గదర్శకాలను కూడా వీరంతా పాటిస్తారు.












Click it and Unblock the Notifications