XLRI:లింగ సమానత్వం-మహిళల్లో సమగ్రనాయకత్వం కోసం ఢిల్లీలో కొత్త క్యాంపస్

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-క్సేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దేందుకు సెంటర్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివ్ లీడర్షిప్‌ కేంద్రాన్ని ఢిల్లీ - ఎన్‌సీఆర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా మహిళలను ఆర్థికంగా లాభదాయకులుగా తీర్చి దిద్దాలని భావిస్తోంది. అంతేకాదు మహిళల్లో సమగ్ర నాయకత్వ లక్షణాలను బయటకు తీసుకొచ్చేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది.

విలువలు, స్థిరత్వం, సోషల్ ఎంట్రప్యెన్యూర్‌షిప్‌ అనే అంశాలు నేటి ప్రపంచంలో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఎక్స్‌ఎల్‌ఆర్ఐ ఈ అంశాలపై ఎప్పుడో దృష్టి సారించింది. కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో విద్యనభ్యసించిన సమాజంలో మెరుగైన స్థానంలో ఉన్న పూర్వపు విద్యార్థులు మరియు ఆయా రంగాల్లోని నిష్ణాతులతో కలిసి నేటి భారతీయ మహిళల యొక్క జీవనశైలిని మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

XLRI sets up a Centre for Gender Equality and Inclusive Leadership at Delhi-NCR Campus

కొత్తగా ఢిల్లీ - ఎన్‌సీఆర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం ఇందుకు వేదిక కానుంది. భవిష్యత్తులో విద్యను మరింత బలోపేతం చేసేందుకు ఇక్కడి నుంచే ఎక్స్‌ఎల్‌ఆర్ఐ అడుగు ముందుకు వేయనుంది. మానుఫాక్చరింగ్ మరియు నాలెడ్జ్ ఎకానమీకి ఈ నూతన కేంద్రం హబ్‌గా ఉంటుంది. ఇక ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని కేంద్రం 37 ఎకరాల గ్రీన్ క్యాంపస్‌లో విస్తరించి ఉంది. ఇది ఝజ్జర్‌కు సమీపంలో ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి గురుగ్రామ్‌కు కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక ఈ క్యాంపస్‌లో ప్రపంచపు అత్యున్నతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంది.

XLRI sets up a Centre for Gender Equality and Inclusive Leadership at Delhi-NCR Campus

ఇక కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్‌ ప్రొఫెసర్ శ్రేయాసి చక్రబర్తి నేతృత్వంలో ముందుకెళుతుంది. ఈమె ఎక్స‌ఎల్‌ఆర్ఐలోని ఆర్గనైజేషనల్ బిహేవియర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అసమానత్వం, భారత్‌లోని ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల పాత్ర వంటి అంశాలపై ప్రాథమిక పరిశోధనలు చేశారు. 2017లో హెచ్‌ఆర్ఎం రంగంలో ఎమరాల్డ్ ఔట్‌స్టాండింగ్ డాక్టొరాల్ డిసర్టేషన్ అవార్డును అందుకున్నారు.

XLRI sets up a Centre for Gender Equality and Inclusive Leadership at Delhi-NCR Campus
XLRI sets up a Centre for Gender Equality and Inclusive Leadership at Delhi-NCR Campus

"సెప్టెంబర్ 2020లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య ఒక 14వ జెండర్ పారిటీపై నివేదిక విడుదల చేసింది. ఆ రిపోర్టులో చాలా భయానక విషయాలు ఉన్నాయి. జెండర్ పారిటీలో భారత్ ర్యాంకు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉంది. నివేదిక ప్రకారం టాప్ ఐదు దేశాలు తమ దేశాల్లో ఉన్న లింగ సమానత్వంపై వివక్షను దాదాపు 80శాతం వరకు తగ్గించేశాయి. ఇందులో ఐస్‌లాండ్ 82శాతం జెండర్ పారిటీకి చెక్ పెట్టింది. ఇక ఈ ర్యాంకుల్లో భారత్ 112వ స్థానంలో ఉంది. ఇక ఆర్థికపరమైన అవకాశాలు భారత్‌లో మహిళలకు చాలా తక్కువగా ఉన్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. ఈ రంగంలో భారత్ 149వ స్థానంలో ఉంది. భారత్ తర్వాత వరుసగా పాకిస్తాన్, యెమెన్, సిరియా, ఇరాక్ దేశాలున్నాయి. ఇక కరోనాతో ఈ అవకాశాలు మరింత తగ్గిపోయాయి. ప్రస్తుతం మహిళలను ఆర్థికపరమైన అంశాల్లో ముందుండేలా ప్రోత్సహించాల్సిన తరుణం ఆసన్నమైంది. మహిళలు ఆర్థికంగా ఎదిగి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలంటే వారిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి" అని శ్రేయాసి చక్రవర్తి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ఆ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.

XLRI sets up a Centre for Gender Equality and Inclusive Leadership at Delhi-NCR Campus

జంషెడ్‌పూర్‌లోని XLRI-xavier school of Management,1949లో ఎఫ్‌ఆర్ క్విన్ ఎన్‌రైట్, ఎస్.జేలు ఏర్పాటు చేశారు. గత ఏడు దశాబ్దాలుగా అంచలంచెలుగా ఎదిగి నేడు బిజినెస్ మేనేజ్‌మెంట్ స్కూల్స్‌లో అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతోంది. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో పబ్లికేషన్స్ మరియు పరిశోధనలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చదివి వెళ్లిన విద్యార్థులు ప్రపంచ దేశాల్లో ఆయా సంస్థల్లో ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఇక ఎక్స్‌ఎల్‌ఆర్ఐకు రెండు అంతర్జాతీయ సంస్థలనుంచి గుర్తింపు ఉంది. ది అసోసియేషన్ టూ అడ్వాన్స్ కొటేజియేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ (AACSB) మరియు అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ(AMBA)లాంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అక్రిడియేషన్ పొందింది. ఇక నేషనల్ బోర్డ్ ఆణ్ అక్రిడియేషన్ కూడా ఎక్స్‌ఎల్‌ఆర్ఐ పొందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+