• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రచయితకు స్వేచ్ఛ ప్రాణప్రదం

By Staff
|

తాను రాసిన నవల పేరునే ఇంటి పేరుగా చేసుకున్న రచయితలు అరుదు. అరుదైన రచయితల్లో నdన్‌ ఉన్నారు. ఆయన రాసిన 'అంపశయ్య' నవల ఆయనకు ఇంటి పేరయింది. ఆ నవల వేసిన ప్రభావం అంతగా వుంది. ఆయన 'ముళ్ల పొదలు', 'అంతస్రవంతి' నవలలు రాశారు. ముళ్లపొదలు నవలలో 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ చిత్రీకరణ జరిపారు. ఎమర్జెన్సీపై 'చీకటి రోజులు' నవల రాశారు. తెలుగు సామాజిక జీత చిత్రణ చేస్తూ ఆయన పలు నవలలు రాశారు. కథలూ రాశారు. ఆయనతో 'ఇండియా ఇన్ఫో' ప్రత్యేక ఇంటర్వ్యూ:

వూరు గురించి, dు బాల్యం గురించి చెప్పండి.

మా స్వగ్రామం వాలాల. జనగామ తాలూకాలో వుండేది. 1956 వరకు జనగామ తాలూకా నల్లగొండ జిల్లాలో వుండేది. 1956లో వరంగల్‌లో చేర్చారు. వాలాల పాలకుర్తికి పది కిలోdుటర్ల దూరంలో వుంటుంది. స్నూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి ఆధీనంలో వున్న 60 ఊర్లలో మా ఊరు కూడా ఒకటి.

1944 నుండి తెలంగాణాలో ప్రారంభమైన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని నేను నా బాల్యంలో కళ్లారా చూశాను. నల్లా నర్సింహులును, రామచంద్రారెడ్డిని ఐదేళ్ల వయస్సప్పుడే రెండు మూడు సార్లు చూశాను. ఈ పోరాటం నా dుద చాలా బలమైన ముద్ర వేసింది. త్వరలో వెలువడనున్న నా నవల 'కాలరేఖ'లో ఐదేళ్ల కుర్రాడి దృష్టిలోంచి ఈ పోరాటాన్ని చిత్రించాను.

చాలా చిన్నప్పట్నుంచే నాకున్న భావాల్ని, నా ఆలోచనల్ని నా చుట్టూ వున్నవాళ్లతో పంచుకోవాలన్న ఆరాటం నాలో బలంగా వుండేది. అదే నన్ను రచయితను చేసింది. మా నాయనగారు ఓ మధ్యతరగతి రైతు. ఆ రోజుల్లోనే ఆయన నాల్గో తరగతి వరకు చదివాడు. భారతం, రామాయణం, భాగవతం మొదలైన కావ్యాలు చదివాడు. పోతన భాగవతంలోని చాలా పద్యాలు ఆయనకు నోటికొచ్చే. ఆయన కథలు చాలా రసవత్తరంగా చెప్పేవాడు. నిజంగా జరిగిన సంఘటల్ని కూడా చాలా నాటకీయంగా నేవాళ్లల్లో గొప్ప ఆసక్తిని రేకెత్తిస్తూ చెప్పేవాడు. కథ చెప్పే పద్ధతి నేను ఆయన నుండే నేర్చుకున్నాను.

సాహిత్యంతో dుకు సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? వరంగల్‌ 'ుత్ర మండలి' గురించి చెప్పండి.

నేను వరంగల్‌ ఎ హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న కథలు రాస్తుండేవాడిని. ఆ స్కూల్లో మాకు తెలుగు చెప్పే శ్వనాథ వేంకటేశ్వర్లు (శ్వనాథ సత్యనారాయణగారి తమ్ముడు) గార్కి ఓసారి నేను రాసిన కథను చూపించాను. 'బావుందిరా! నువ్వు సాహిత్యంలో కృషి చేస్తే తప్పకుండా పైకొస్తావు'' అన్నాడు.

అయితే నేను 1958లో వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో చేరడం నా జీతంలో గొప్ప మలుపు. అక్కడ అధ్యాపకులుగా పని చేస్తున్న జి.. సుబ్రహ్మణ్యం, ఇరివెంటి కృష్ణమూర్తి, వేటూరి ఆనందమూర్తి లాంటి సాహితీవేత్తల శిష్యరికం లభించింది. ఎంతో గొప్ప రచయితల రచనలు అధ్యయనం చెయ్యడం అక్కడే ప్రారంభమయింది. ఆ రోజుల్లోనే- 1957లో అనుకుంటాను- హనుమకొండలో కాళోజి రామేశ్వరరావుగారు 'ుత్ర మండలి' అనే ఓ రచయితల వేదికను స్థాపించారు. ుత్ర మండలి ఇప్పటికీ మని చేస్తున్నది. ప్రతీ పదిహేను రోజులకొకసారి 'ుత్ర మండలి' సమావేశాలు జరుగుతుండే. ఆ సమావేశాల్లో రచయితలు తాము రాసిన రచనల్ని చది నిపించేవారు. తర్వాత ఆ రచనల dుద చర్చ జరిగేది. ఈ చర్చలు కొత్త రచయితలకెంతో ఉపయోగకరంగా ఉండే. కాళోజి నారాయణరావు, అనుముల కృష్ణమూర్తి, జి.. సుబ్రహ్మణ్యం, ఇరివెంటి కృష్ణమూర్తి, కేతవరపు రామకోటి శాస్త్రి, పి.జి. లాలే, పాములపర్తి సదాశివరావు, సి.. కృష్ణారావు లాంటి సాహితీవేత్తలెంతో మంది ఈ ుత్రమండలి సమావేశాల్లో పాల్గొనేవాళ్లు. ఈ సంస్థకు వరవరరావు మొదటి కన్వీనర్‌- నేను రెండో కన్వీనర్‌ని. 1959 నుంచి 1962 వరకు నేను ుత్రమండలి కన్వీనర్‌గా పని చేశాను. ుత్ర మండలి సమావేశాల్లో పాల్గొనటం వల్ల నాలోని రచయితకు ఓ స్పష్టమైన స్వరూపం ఏర్పడింది.

ఉస్మానియా యూనివర్శిటీ జీతాన్ని dురు అంపశయ్య నవలలో ఆష్కరించారు. ఆ నవల పేరు dుకు ఇంటి పేరు అయింది. dు రాజకీయ శ్వాసాల గురించి చెప్పండి. నెహ్రూ సోషలిజం పట్ల dు పాజిటివ్‌ దృక్పథానికి కొంత వరణ ఇవ్వండి. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆర్భంచిన నలభై ఏళ్ల తర్వాత కూడా మార్క్సిస్టు మేధావులు నెహ్రూ సోషలిజాన్ని శ్వసించడమంటే ఈ దేశంలో కమ్యూనిజాన్ని అప్లయ్‌ చేయడంలో ఫలమయ్యారనిపిస్తుంది. రేమంటారు?

నాది మొదటి నుంచి మధ్యేమార్గం. సోషలిజంలోని మంచిని, క్యాపిటలిజంలోని మంచిని తీసుకుని ప్రజాస్వామ్యబద్దంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల్ని తీర్చవచ్చునన్నది నా ప్రగాఢ శ్వాసం. అందుకే నెహ్రూ రూపొందించిన Mixed Economy, Socialist pattern of Society లేదా Democratic Socialism లాంటి నాకు బాగా నచ్చాయి. కమ్యూనిస్టులు నెహ్రూ సోషలిజాన్ని నమ్మారంటే అది ఈ దేశంలో కమ్యూనిజాన్ని అప్లయ్‌ చెయ్యడంలో వాళ్లు ఫలమయ్యారన్నట్టేనా అనే dు ప్రశ్నకు అసలీ దేశంలో కమ్యూనిజం అంటూ వస్తే స్వాతంత్ర్యానికి ముందే రావలసింది. ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని రూపొందించటంలో ఈ దేశ కమ్యూనిస్టులు ఫలమయ్యారనే చెప్పాలి. స్వాతంత్ర్యం తర్వాత ఈ దేశ ప్రజల దృష్టిలో గాంధీ, నెహ్రూ, పటేల్‌ మొదలైనవాళ్లు చాలా పెద్ద హీరోలయిపోయారు. ప్రజలకు ఈ నాయకుల పట్ల ఏర్పడిన ఆరాధనను ఏ కమ్యూనిస్టు నాయకుడూ చెరిపెయ్య లేకపోయాడు.

''తెలుగు ప్రాచీన సాహిత్యంలో అసందర్భపు వర్ణనలు, ఒక్క వాక్యంలో చెప్పాల్సిన షయాన్ని వంద పద్యాల్లో చెప్పడం- పింగళి సూరన, పాల్కురికి సోమనాథునిలో తప్ప ుగిలినవాళ్లలో కాల్పనికత లేదు'' అని అన్నారు దాశరథి రంగాచార్యగారు dు 'ముళ్లపొదలు' ముందుబాటలో. dు అభిప్రాయం చెప్పండి.

రంగాచార్యగారి అభిప్రాయంతో ఏకీభస్తున్నాను.

తెలుగు సాహిత్యకారులు పాల్కురికి సోమనాథునికి సముచితమైన స్థానాన్ని ఇవ్వలేదనిపిస్తుంది. ఒక సామాజిక ప్రయోజనంతో అప్పటి వరకున్న ఫామ్‌ని కూడా తిరస్కరించిన తొలి తెలుగు ప్లవ కని చీకటి కోణాల్లో దాచి వుంచడానికి కారణమేమై వుంటుందంటారు?

పాల్కురికి సోమనాథునికి సముచితమైన స్థానం ఇవ్వలేదన్న అంశాన్ని గూర్చి నేను ప్రత్యేకంగా స్టడీ చెయ్యలేదు. కాబట్టి ఆ షయాన్ని గురించి నేనేdు చెప్పలేను.

ఆధునిక సాహిత్యకారుల్లో రాజకీయ నిబద్ధత మాత్రమే వుండి నిమగ్నత లోపించడం వల్ల తెలంగాణా జిల్లాల నుంచి రావాల్సినంత బలమైన సాహిత్యం రాలేదన్న అభిప్రాయం dుద dురేమంటారు?

ఈ 'నిబద్ధత', 'నిమగ్నత' గొడవేుటో నాకు తెలీదు. తెలంగాణా జిల్లా నుంచి కూడా బలమైన రచనలు వచ్చాయనే నేననుకుంటున్నాను.

dు రచనల్లో ుమ్మల్ని dురు భయస్థులుగా చిత్రీకరించుకున్నారు. dురు 'రసం' (ప్లవ రచయితల సంఘం)తో మమేకం కాకపోవడానికి ఈ భయమే కారణమా? లేదంటే dుకు ఆ సంస్థతో వైరుధ్యాలేమైనా వున్నాయా?

నా రచనల్లో నన్ను నేను భయస్థునిగా చిత్రీకరించుకున్నానని dురంటున్నారు. నేను పెద్ద ధైర్యవంతున్నని, dరున్నని చెప్పలెను గానీ భయస్థున్ని కూడా కాను.

రసంతో మమేకం కాకపోవడానికి భయం కారణం కాదు. మొదలే చెప్పాను కదా... నాది అప్పుడైనా ఇప్పుడైనా మధ్యేమార్గం. Right Extremism తో గానీ, Left Extremismతో గానీ మమేకమయ్యే సమస్యే లేదు. రసంలో చేరిన మహామహా రచయితల్లో చాలా మంది ఆ సంస్థకు రాజీనామా చేసి బయటకొచ్చారు. కొందరేమో మాదీ రసం దారే రసంలో సభ్యులుగా మాత్రం చేరలేం. దీనికి కారణాలేుటంటారు? నా ఉద్దేశ్యమేుటంటే రచయిత అయినవాడెవ్వడూ 'ఇలాగే రాయాలి- ఇలా రాయొద్దు' అని ఆజ్ఞలు జారీ చేసే ఏ సంస్థలో కూడా చేరకూడదు. రచయిత అయినవాడికి స్వేచ్ఛ ప్రాణప్రదమైంది.

1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని దగ్గరగా దర్శించిన రచయితగా ఈనాటి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమం గురించి dురేమనుకుంటున్నారు? 1969 నాటి ఉద్యమానికి ఈనాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మౌలిక తేడాలేమైనా ఉన్నాయా?

తెలంగాణా ఉద్యమం 1952లోనే ప్రారంభమైంది. ముల్కీ రూల్స్‌ని సక్రమంగా అమలు చెయ్యడం లేదని ద్యార్థులు 1952లోనే ఉద్యమాన్ని లేవదీశారు. హైదరాబాద్‌లో ద్యార్థుల dుద ఫైరింగ్‌ జరిగింది. ఇద్దరో ముగ్గురో ద్యార్థులు ఆ ఫైరింగ్‌లో చనిపోయారు. కానీ చాలా త్వరగానే ఈ ఉద్యమం చల్లబడింది.

1969లో జరిగిన ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో చాలాకాలం- దాదాపు రెండేళ్లు సాగింది. ఈ ఉద్యమాన్ని కూడా మొదట ద్యార్థులే ప్రారంభించారు. తర్వాత అది రాజకీయ నాయకుల చేతుల్లోకెళ్లి భ్రష్టు పట్టిపోయింది. తెలంగాణా అంటూ వస్తే అప్పుడే రావల్సింది. తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారని 1971లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. స్వార్థపరులైన రాజకీయ నాయకుల కారణంగానే అప్పుడు తెలంగాణా రాలేదు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం dుద నాకు పెద్ద నమ్మకం లేదు. మెజారిటీ ప్రజలు కూడా ఈ ఉద్యమాన్ని నమ్మడం లేదు. అప్పుడు తెలంగాణా ఏర్పడాలని కోరుకున్న ప్రజలు కూడా ఇప్పుడు తెలంగాణా ఏర్పడాలని గానీ, తెలంగాణా ఏర్పడితే తెలంగాణా ప్రజలకేదో పెద్దగా ఒరుగుతుందని గానీ అనుకోవడం లేదు. We missed the bus in 1969 itself.

తెలంగాణా సాహితీ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈనాటి రచయితలకు కళకారులకు dురేం చెప్పదల్చుకున్నారు?

సాహితీ సాంస్కృతిక వారసత్వం ఎప్పుడూ ఒకేలా వుండదు. ప్రతీ సంస్కృతిలోనూ కొన్ని కాలానుగుణమైన మార్పులొస్తుంటాయి. ఆ మార్పలతో ఇష్టమున్నా లేకపోయినా మనం సర్దుబాటు చేసుకోక తప్పదు. తెలంగాణా సాహితీ సాంస్కృతిక సంప్రదాయాల్లో కూడా కొన్ని మార్పులొస్తున్నాయి. ఇది ప్రతి సంస్కృతిలోనూ జరుగుతున్నదే కాబట్టి వారసత్వాన్ని కాపాడుకోవాలని ఓ రచయిత ఆ సంస్కృతిని ఆదర్శీకరిస్తూ ఓ నవలో, కథో రాయొచ్చు. అది చదినవాళ్లు ఒకప్పుడు మన సంస్కృతి ఇలా వుండేదని గుర్తు చేసుకోవచ్చు. శ్వనాథ సత్యనారాయణగారు వేయిపడగలు నవలలో చేసిన పని ఇదే కదా... భారతీయ సంస్కృతి పతనమైపోతున్నదన్న బాధ ఆ నవల ప్రతి పేజీలో కనిపిస్తుంది. కానీ ఆధునిక యుగంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సాధించిన, సాధిస్తున్న అనూహ్యమైన ప్రగతి వల్ల తరతరాల సంస్కృతీ సాంప్రదాయాలు మారుతున్నాయి. ముందు ముందు ఈ మార్పు ఇంకా వేగవంతమౌతుంది. భాష మారుతుంది. వేషం మారుతుంది. ఆచారా వ్యవహారాలు మారుతాయి. జీవన ధానం, జీవన శైలి మారతాయి. ముఖ్యంగా అభివృద్ధికి ఆటంక కాని అంశాలు నిలుస్తాయి. అందుకని ఒక సంస్కృతిని ఆ సంస్కృతిలోని కాలానుగుణమైన మార్పులకు తట్టుకొని నిలబడే బలమైన అంశాలే కాపాడతాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more