పార్ట్-34
అంతే రసూల్ శవమై కూడా తిరిగి రాలేదు.
గుర్తు తెలియని నక్సలైట్ పేర దిక్కు మొక్కు లేకుండా మరణించింది రసూలేనని తెలిసింతర్వాత అందరూ వేగంగా కదిలారు.
ఎంతగా కదిలినా జరగాల్సింది జరిగిపోయింది,. ప్రభుత్వం చేయదల్చుకున్నది చేసింది.
ఇటు ఒక వైపు రసూల్ శవం కోసం ఎడిటర్‌తో సహా క్రైమ్ రిపోర్టర్ వరకు హోంమంత్రితో, డిజిపితో మాట్లాడుతుండగానే మాయ అంతా జరిగిపోయింది.
గాంధీ ఆస్పత్రి మార్చురీలోంచి రసూల్ శవం మాయమైంది. హోంమంత్రి చేతులెత్తేశాడు, డిజిపి చేతులెత్తాశాడు. చేతులెత్తయడానికి తగిన వ్యవధినంతా వాళ్లు తీసుకున్నారు.
అంతే జర్నలిస్టు లోకం అగ్గి మీద గుగ్గిలమైపోయింది.












Click it and Unblock the Notifications
