అపరిచితుడిదాఖలాకు కవిత్వ దివిటీ

Posted By:
Subscribe to Oneindia Telugu
రాత్రిపదయింది
ఆఫీసు పని పూర్తి చేసుకుని
లెక్సింగ్టన్‌ అవెన్యూలో రైలు దిగి
ఆకాశానికి వేలాడుతున్నభవంతుల మధ్య నుండి
వడివడిగా నడుస్తున్నాను

కుక్కలఅరుపులు లేవు
యజమానుల లాలనలో
వారి పక్కనే నిద్ర పోయుంటాయి

వీధిలోఅక్కడక్కడ
ఎవరో వదిలేసిన వస్తువుల్ని చుట్టూపేర్చుకుంటూ
నిద్ర కోసం సర్దుకుంటున్ననిరాశ్రయులు
ఉండుండి
చిరుజల్లు
చెవుల్ని చీల్చుకుంటూ ఈదురు గాలి
చలికి వణుకుతున్నాను

ఆదివారం
రోడ్లు రద్దీగా లేవు
ఎదురు చూసిన
వారాంతపు ఆనందంతీరకముందే
ఎవరూ కోరుకోని
సోమవారపు దుఃఖం

అల్లంతదూరంలో
ఒక జంట
వారి మధ్య ఒక చిన్నారి
కూతురనుకుంటాను
అరుస్తూ అతను
ఏడుస్తూ ఆమె
పాపని చెరో వైపు లాగుతున్నారు
పగలనిపించే దీపాల వెలుగులో
అంతా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది

ఉన్నట్టుండి
ఆమెను తోసి
అరుస్తూ ఏడుస్తూ ఆమె లేచే లోగా
ఆటబొమ్మని విసిరేసినట్టు
పాపను కారులో పడేసి
దూసుకుపోయాడు

ఏమిచేయాలో తెలీదు
ఆమెకి కూడా బహుశా
నిట్టూరుస్తూ ఆమె పక్కనుండే పోయాను

అయినా
ఆ రాత్రి
ఆమె అశక్తత
నా నిస్సహాయత
నన్ను మాత్రం వెంటాడుతూనేఉన్నాయి

-ముకుంద రామారావు

 • ఉనికి

 • నేను

 • తెలంగాణకాశ్మీరు కాదు!

 • హైకూలు

 • చకోరాలు

 • మావూరు

 • అమృతం

 • అమెరికా- చమురు

 • రోడ్డు

 • లతీఫ్‌- సామేలులు

 • రూట్స్‌

 • మర్ఫా

 • పాషాణం

 • గుడ్లగూబ

 • మొగిలిచెర్ల

 • నాకలల పునాదులు

 • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

 • చేలోకిపురుగులొస్తున్నాయి

 • సహజీవనంవర్ధిల్లు గాక!

 • మొబైల్‌పక్షులు

 • చెలిమి

 • క్షీరదాలు

 • ఉభయచరాలు- అండజాతులు

 • డివైన్‌రోమాన్స్‌

 • కొత్తపుట్టుక

 • సంకల్పబలం

 • సముద్రజీవులు

 • ఎలానడుస్తావో

 • వానకిటికీ

 • విశ్వమానవత

 • చిలుక

 • మబ్బులు

 • ఆగంతకుని స్వప్నం

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి