చికాగోలో తెలుగు సాహిత్యం
2007 డిశంబరు 29 శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీ మీటింగ్ హాల్ లో
సాహితీ సమావేశం జరుగుతుందని చికాగో సాహితీ మిత్రులు కార్యదర్శి శారద మెట్టుపల్లి చెప్పారు. ఆసక్తి వున్నా వారు తమకు నచ్చిన తెలుగు కథ ,కవిత,వ్యాసం మరేఇతర సాహిత్యపరమైన విషయాన్నైనా అందరితో పంచుకోవచ్చు. కొత్త పుస్తకాలను పరిచయం చేయవచ్చు. స్వీయ రచన ను వినిపించవచ్చు. తెలుగు సాహిత్యం పట్ల ప్రేమ, అభిమానం ఉన్న వాళ్లు చికాగో సాహితి మిత్రులతో కలసి పనిచేయవచ్చు, సలహాలు ఇవ్వొచ్చు. ఈ సమావేశానికి రావలసిందిగా అందరిని ఆహ్వానిస్తున్నామని శారద మెట్టుపల్లి తెలిపారు.












Click it and Unblock the Notifications