యుఎఇలో తెలంగాణ పల్లె పాట

అక్రమంగా ఉంటున్న తెలంగాణ కూలీల సమస్యలకు పరిష్కారం చూపే దిశలో కృషి చేయాలని సంఘం నిర్ణయించుకుంది. తెలంగాణ నుంచి వలస వచ్చినవారి సమస్యలపై భారత రాయబార కార్యాలయానికి విన్నవించాలని కూడా నిర్ణయించుకుంది. మద్యపానానికి, ఇతక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా వలస కూలీలను చైతన్యవంతులను చేయాలని సంఘం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కూలీలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా సంఘం ఉంది. పల్లెపాట కార్యక్రమానికి ఆల్ కంజ్ గ్రూప్, ఎయిర్ అరేబియా, ఎమిరేట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్, ఎలైట్ గ్రూప్ సహకారం అందించాయి.
తెలంగాణ పల్లె పాట కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకులు, వాగ్గేయకారులు దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, అంతడుపుల నాగరాజ్, తెలు విజయ, కవిత, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ఆవరణ క్రిక్కిరిసి పోవడం ఆల్ నాసర్ లీజర్ ల్యాండ్ చరిత్రలో ఇదే మొదటి సారి.












Click it and Unblock the Notifications