పాఠకుల చెంతకు పుస్తకాలు

"టివి, ఇంటర్నెట్‌ల వల్ల చదివే అలవాటు తగ్గిపోయింది అంటున్నారు. మరి అది ఇంగ్లీషు పుస్తకాలకు కూడా వర్తించాలి కదా. కాని ఇంగ్లీషు పుస్తకాలు బాగానే అమ్ముడుపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే అందరికీ అందుబాటులో లేకపోవడం వల్లనే పుస్తకాలు కొనడంలేదనిపిస్తోంది. ఆ లోటును భ ర్తీ చేసే ప్రయత్నమే మాది. అందుకోసం డిస్ట్రిబ్యూషన్, ఏజెన్సీ నెట్‌వర్క్ పెట్టాం. జంటనగరాల్లో, వరంగల్, విజయవాడల్లో మాకు ఏజెంట్లు ఉన్నారు. మిగతా జిల్లాల్లో కూడా త్వరలో పెట్టబోతున్నాం. వెబ్‌సైట్‌లో కాకుండా ఫోన్ల ద్వారా వచ్చిన ఆర్డర్లకు ఏజెంట్ల ద్వారా పుస్తకాలు అందిస్తాం'' అని చెప్పింది తన్మయి. ఈమె సుపథ సిఓఓగా వ్యవహరిస్తోంది.
"మా వెబ్‌సైట్‌లో మొత్తం 30 కెటగిరీలు ఉన్నాయి. యువత కోసం వ్యక్తిత్వ వికాసం, పిల్లల కోసం కథలు, పాటల పుస్తకాలు... ఇలా వయసుల వారీగా పుస్తకాలు లభిస్తాయి. ఈ వెబ్‌సైట్‌లో పెట్టే పుస్తకాలను ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యుల పానెల్ ఉంది. మా అమ్మ ప్రచురణ సంస్థను నడుపుతున్నారు. అందుకని తను కూడా మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. వెబ్‌సైట్ ప్రారంభించిన మొదటి వారంలోనే అమెరికా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్‌ల నుంచి ఆర్డర్లు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, ఆంగ్ల భాషలకు చెందిన పుస్తకాలను, రామకృష్ణ మఠం ప్రచురణలు కూడా వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాం'' అని చెప్పింది సుపథకి సిఇఓగా వ్యవహరిస్తున్న పల్లవి.












Click it and Unblock the Notifications