రచయిత త్రిపుర కన్నుమూత

త్రిపుర కథలు పేరు మీద ఆయన కథలు పుస్తకంగా వచ్చాయి. తొలుత 13 కథలతో వచ్చిన సంకలనం, ఆ తర్వాత రెండు కథలు చేర్చి 15 కథలతో మలి ముద్రణగా వచ్చింది. ఆయన కవిత్వం బాధలూ - సందర్భాలూ పేరు మీద సంకలనంగా వచ్చింది. ఆయన 1928 సెప్టెంబర్ 2వ తేదీన ఒడిషాలోని పురుషోత్తంపురంలో జన్మించారు.
త్రిపుర పూర్తి పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు. ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాము, భగంవతం కోసం, వంతెనలు, సఫర్ వంటి ఆయన కథలు తెలుగు పాఠకులకు విశేషమైన అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చాయి.
మానవ జీవితంలోని చీకటి కోణాలను ఆయన తన కథల్లో ఆవిష్కరించారు. తెలుగులో అత్యంత అరుదైన రచయితగా ఆయన నిలిచిపోతారు. మ్యాజిక్ రియలిజాన్ని ఆయన తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు. కథకుల కథకుడు త్రిపుర. అగర్తాలాలోని త్రిపుర విశ్వవిద్యాలయంలో 1960లో స్థిరపడేవరకు ఆయన బర్మా, మదననపల్లి, విశాఖపట్నం, జైపూర్‌ల్లో పనిచేశారు. ఆయన కథల్లో జెన్ బౌద్ధం, క్రైస్తవం వస్తువుగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications