'ఏడు పదుల' సాహిత్యోద్యమం
హైదరాబాద్: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 70వ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాహితీమూర్తుల శతజయంతి సభలో అనేక మంది సాహితీవేత్తలు పాల్గొన్నారు. హైదరాబాదు నగరంలోని ఆంధ్ర సారస్వత్ పరిషత్ హాలులో అరసం ఆధ్వ ర్యంలో జరిగిన శతజయంతి సాహితీమూర్తులు తుమ్మల వెంకట్రామయ్య, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీల స్ఫూర్తి సభలో పలువురు సాహితీవేత్తలు మాట్లాడారు.
అలుపెరుగని ఉద్యమ సాహిత్యకారులే కాకుండా, సాహిత్యోద్యమ కార్యకర్తలు తుమ్మల వెంకట్రామయ్య, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీ నారాయణరావు అని ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. తుమ్మల ఆదర్శజీవితం, సమన్వయ స్ఫూర్తి మానవ సంబంధాలు భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. వట్టికోట ఆళ్వారుస్వామి, ఉద్యమ తళ్వారు అని ఇఫ్టా జాతీయ ఉపాధ్యక్షులు కె.ప్రతాపరెడ్డి కొనియాడారు. ఆళ్వా రుస్వామి కేవలం రచయిత మాత్రమే కాదని, రాజకీయ, కార్మికోద్యమ నేత అని, బీదరికంలో జీవితం గడిపి, సాహితీకారుడిగా ఎదిగిన విప్లవకారుడని కొనియాడారు. ఆయన జైలు జీవితం, గొప్ప కథలు రావడానికి, నేపథ్యమైంద న్నారు. కాళోజీ పాలకవర్గాలకు ఒక ధిక్కార స్వరం అని అరసం వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వి.వీరాచారి అన్నారు.

అరసం అధ్యక్షవర్గ సభ్యులు కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ అరసం చేపట్టిన ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమైన వని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అరసం 'ఏడుపదుల ఉద్యమ' ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్మిక నాయ కులు జి.ఓబులేసు సందేశమిచ్చారు. అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అరసం ఉద్యమ ప్రస్థానాన్ని వివరించారు. అరసం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వేల్పుల నారాయణ అరసం ఉద్యమ కార్యక్రమాలను వివరించారు.
నల్లూరి శివప్రసాద్ 'అరసం' ఏడు పదుల ఉద్యమ ప్రస్థాన పుస్తకాన్ని సమీక్షించారు. విరసం నాయకులు వరవరరావు సందేశమిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ అరసం కార్యదర్శి రాపోలు సుదర్శన్ అధ్యక్షత వహించగా, కెవిఎల్ ఆహ్వానం పలికారు.కార్యక్రమంలో అరసం నాయకులు పల్లె వీర స్వామి, బొమ్మగాని నాగభూషణం, బాబ్జీ, నాలేశ్వరం, శంకరావు, అప్పారావు, స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications