వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్ఞానపీఠ్ అందుకున్న రావూరి భరద్వాజ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ జ్ఞానపీఠ్ అ వార్డును స్వీకరించారు. శుక్రవారం తీన్‌మూర్తి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సరోద్ వాయిద్య కళాకారుడు ఉస్తాద్ అమ్జాద్ అలీ ఖాన్ చేతు రావూరి భరద్వాజకు ఈ అ వార్డును, ప్రశంసా పత్రాన్ని బహూకరించి, శాలువాతో సత్కరించారు.

2012వ సంవత్సరానికి గాను రావూరి భరద్వాజ దేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తెలుగు సాహిత్యకారుల్లో రావూరి భరద్వాజ మూడోవారు. రావూరి భరద్వాజ కృష్ణాజిల్లా మొగులూరు గ్రామంలో 1927లో జన్మించారు.

Ravuri Bharadwaja

1946లో నెల్లూరులో యువ సమ్మేళనానికి హాజరైన భరద్వాజ జమీన్ రైతు అనే వార పత్రికలో చేరారు. తర్వాత పలు మాసపత్రికల్లో పనిచేసిన భరద్వాజ ఆకాశవాణికి కూడా రచనలు చేశారు. ఆయన రచించిన విమల అనే కథ 1946లో ప్రచురితమైంది. అనంతరం 172 రచనలు చేసిన భరద్వాజ కవితలు, పద్యాలు, కథల్లో తనదైన శైలిని కనబర్చారు.

భరద్వాజ రాసిన పంచ మహా కావ్యాలు ఈ శతాబ్దపు గొప్ప రచయితగా పేరు తెచ్చాయి. 17 ఏళ్ల వయస్సులో రచయితగా ప్రస్థానం ప్రారంభించిన భరద్వాజ రెండుసార్లు రాష్ట్ర సాహిత్య అకాడెమీ అ వార్డు, కేంద్రీయ సాహిత్య అ కాడెమీ అ వార్డు, గోపీచంద్ అ వార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అ వార్డు, భారతీయ భాషాపరిషత్ అ వార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారంతో పాటు మిక్కిలి అ వార్డులు, పురస్కారాలు అందుకున్నారు.

English summary
Telugu writer Ravuri Bharadwaja has been presented Jnanapeeth award by the Ustad Amzad Ali Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X