చేరా కన్నుమూత

ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యుడయ్యాడు. ఆయన అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుండి ఎం. ఏ., పి.హెచ్.డి. డిగ్రీలు పొందాడు.
ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహూకరించింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆయన రాసిన చేరాతలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. చేకూరి రామారావు 1934 అక్టోబర్‌లో ఖమ్మం జిల్లా మథిర సమీపంలోని ఇల్లిందలపాడు గ్రామంలో జన్మించారు.
తెలుగు వాక్యం, వచన పద్యం: లక్షణ చర్చ, రెండు పదుల పైన, తెలుగులో వెలుగులు (భాషా పరిశోధన వ్యాసాలు), చేరాతలు సాహిత్య విమర్శ - పరామర్శ, చేరా పీఠికలు, ముత్యాల సరాల ముచ్చట్లు, ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం, స్మృతికిణాంకం, భాషానువర్తనం, భాషాంతరంగం, సాహిత్య వ్యాస రింఛోళి, కవిత్వానుభవం, వచన రచన తత్త్వాన్వేషణ, సాహిత్య కిర్మీరం, భాషా పరివేషం అనే రచనలు చేశారు.












Click it and Unblock the Notifications