విశాఖలో మొజాయిక్ సాహిత్య వేడుకలు

విశాఖపట్నం: మొజాయిక్ సాహిత్య సంస్థ దశాబ్ధి ఉత్సవాలను ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ సంయుక్త కార్యదర్శి జగద్ధాత్రి తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆమె బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు.

తొలి రోజు డివి సూర్యారావుతో దశాబ్ది ప్రస్తావన, పూలండోయ్ పూల్, సిక్స్త్ ఎలిమెంట్ కవిత్వ సంపుటి ఆవిష్కరణ ఉంటాయని ఆమె చెప్పారు. 18వ తేదీన జ్యోతిర్మయి గజల్స్ ఆల్బమ్ ఆవిష్కరణ, అసంఖ్యాక నక్షత్రాలు, ఎగిరిపోతున్న పిట్టల కోసం కవిత్వ సంపుటుల ఆవిష్కరణ ఉంటాయని చెప్పారు

 Literary festival at Visakhapatnam

19వ తేదీన స్వరధార భారతీయ కవిత్వం ఆవిష్కరణ ఉంటాయని ఆమె చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని జగద్ధాత్రి చెప్పారు.

మీడియా సమావేశంలో సంస్థ అధ్యక్షుడు ఎల్ఆర్ స్వామి, ప్రధాన కార్యదర్శి రామతీర్థ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+