తెలుగు సాహితి: జానపదానందం

Telugu Literature: fourth day on folklore
హైదరాబాద్: ‘మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం' నాలుగో రోజు బుధవారంనాడు జానపదానికి ప్రాదాన్యత ఇచ్చి తక్కువ సమయంలో ఎక్కువ ఆహ్లాదాన్నీ, విజ్జానాన్నీ కలిగించింది. ముందుగా ఐదు గంటలకి సుప్రసిద్ధ గాయని "శివశంకరి" గీతాంజలి బృందం వారు జనరంజకమైన జానపద పాటలతో అందరినీ అలరించారు.

ఆ తరువాత జరిగిన ప్రారంభ సభలో ఆచార్య పప్పు వేణుగోపాల రావు, సిలికానాంధ్ర అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ హాస్య రచయిత్రి పొత్తూరి విజయ లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి సముచిత ప్రసంగాలు చేశారు.

తరువాత జరిగిన జానపద సాహిత్య వేదిక లో ఒగ్గు కథ మీద గంగా ప్రసాద్ సాధికారిక ప్రసంగం, జానపద పొడుపు కథల మీద భోజన్న ఆసక్తికరమైన ప్రసంగం, ఇతర వైవిధ్యమైన జానపద సాహిత్య, కళారూపాల అంశాల మీద మరొక ఆరు మంచి ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ నాలుగవ రోజు సభని శ్రీమతి గీతాంజలి సమర్ధవంతంగా నిర్వహించారు. అక్టోబర్ 5 దాకా ప్రతీ రోజూ సాయంత్రం 5 నుండి జరిగే ఈ యువ సాహితీ సభలకు అందరూ ఆహ్వానితులే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+