మాలతీ చందూర్ కన్నుమూత

malathi chandur
చెన్నై: ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ మాలతీ చందూర్ (83) తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం సాయంత్రం కన్ను మూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తొలి మహిళ కాలమిస్టుగా గుర్తింపు సాధించిన మాలతీ చందూర్ 1930వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చారు. తెలుగులో తొలి తరం మహిళా రచయిత్రిగా ఆమెకు మంచి గౌరవం ఉంది.

ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నూజివీడు, ఏలూరులో పూర్తి చేశారు. ఆమె చిన్ననాటినుంచే నవలు, కథలు, విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. ఆమె దాదాపు దశాబ్దంన్నర పాటు ఓ తెలుగు పత్రికలో వివిధ శీర్షికలు నిర్వహించారు. దాంతో ఆమె గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆమె తెలుగు, ఆంగ్ల, తమిళ భాషల్లో రచనలు చేశారు. తెలుగులో పాతికకు పైగా రచనలు చేశారు.

ఆంధ్రప్రభ పత్రికలో వచ్చే ‘ప్రమాదవనం' అనే ఫీచర్‌తో మాలతీ చందూర్ మంచి గుర్తింపు పొందారు. ఆమె అనేక పత్రికలకు వివిధ రకాల శీర్షికలను అందించారు. మాలతి చందూర్‌ దాదాపు ఆరు దశాబ్దాలుగా చెన్నైలో నివసిస్తునారు. కేవలం రచయిత్రిగానే కాకుండా ఆమె జగతి అనే మాసపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. జర్నలిస్టుగా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది.

నవలా రచయిత్రిగా, మహిళలకు సంబంధించిన అంశాలపై రచనలు చేసిన కాలమిస్టుగా అనేక పురస్కారాలు ఆమె అందుకున్నారు. 70వ దశకములో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పని చేసిన మాలతీ చందూర్ తాను చూసే తమిళ సినిమాలను అర్థం చేసుకోవడానికి తమిళ భాష నేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా అనేక తమిళ రచనలను తెలుగులోకి అనువదించారు. మాలతీ చందూర్ వినదగు విషయాలు, వంటలు పిండి వంటలు, శశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు వంటి నవలలు రాశారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+