సాహితి
నన్నుదరిచేరిన ప్రతిరూపమూ
స్పష్టత వెలుగులో విస్తరిస్తుంది.
ఆ స్పష్టత వెనుక వెండి పూతమెరుపుంది.
నా కంటికి -
భ్రమలూ, ఊహలూ అంటవు.
కులాలు, మతాలు కుట్టవు.
స్త్రీ, పురుష భేదాలు ముట్టవు.
మనిషిని మనిషిగా గుర్తిస్తాయి.
నిజాన్ని నిజంలా చూపుతాయి.
నువ్వు చూసేదే
నా హృదయం హత్తుకుంటుంది.
నచ్చినా నచ్చకపోయినా -
అందులో
నాలో నువ్వూ,
నీలో నేనూ-
అది - మనోరూపాల అపురూపసంగమం!
నీ దృశ్యం తెరమరుగైతే,
రూపాంతరం నా గమ్యం.
నావెలుగులో
ఆహ్లాదం ఎత్తు పెరిగీ
ప్రతీ రూపాన్నీ
హిమాయాలపై చేరుస్తుంది.
కురూపి కూడా నా హృదయంలో ఒకమన్మథుడే!!
నాసహచర్యంలో
నిన్ను నీవుగా చూపిస్తే
కమ్మిన అహపు పొరలలో
నీ రూపం పసిగట్టలేక
ఉన్నదానికి కంటే ఎక్కువగా
అందమనే భ్రమనంంటించుకొనినిష్క్రమిస్తావు.
నాలో నిన్ను చూసుకోవడం
నీకొక దినచర్య.
ప్రతి రోజూ
నాలో నిన్ను కాదు.
నీలో నిన్ను చూసుకో!
నువ్వే కాదు విశ్వం యావత్తూ
మానవత్వపుటద్దంలో
సమానత్వపు మెరుపుతీగలా
నిన్నల్లుకుంటుంది
ప్రవర్తన దర్పణమై
నిన్ను నిన్నుగా చూపిస్తుంది.
-సాయి బ్రహ్మానందం గొర్తి
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications