ఒంటరిగుంపు
ఒకదృశ్యానికి మరో దృశ్యానికి నడుమ
మొలుచుకొచ్చిన గోడలు
సిమెంటు కాంక్రీటు దయతలిస్తేతప్ప
తలదాచుకోలేని ఆకుపచ్చదనం
సహజమైన ఆకలి సహస్ర ముఖాలతో
వికృతమై వింజృంభిస్తున్నదశలో
బిగుసుకున్న పిడికిళ్లు ఈగుంపులోనే!
ఇక్కడే గుంపులో మనిషి మరీవొంటరివాడై
లోలోపల మండే అంతరాత్మలో
దాక్కొన్న చీకటి కొట్టంలో
మళ్లీ తనవాళ్ల కోసం దేవులాడేఆర్తిలో
ఈ ఒంటరి గుంపులో నగరజీవితవేగంతో!
ఎవరెవరి అసలు ముఖాలు
ఏ మూలలో ఏ గోడ వెనక
ఏ కొమ్మల కింద బిక్కుబిక్కుమంటూ
తన తనంలో జీవిస్తున్నదో?
ఎప్పటికప్పుడు ఇక్కడే ఈ తారురోడ్డుపక్క
మనమంతా మళ్లీ మళ్లీ అన్వేషించకతప్పదు
విద్వేషాల విచ్చుకత్తుల విషపు నవ్వులఎదుట
మంచితనపు చేతకానితనం
చేజేతులా నశిస్తే
-నిఖిలేశ్వర్
చిరునవ్వు
ఇన్సానియత్
అమ్మ
మావూరి పూల మొక్క
భూమిభాష
జలపాతం
ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...
జంతర్‌మంతర్ పెట్టె
బాపూ!నన్ను మన్నించు!!
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం