పొడ
వట్టిపోయినబర్రె
పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చింది
సూటు బూటు నీటుగాడివి
నీ యావ వేరు
నీ రంధి వేరు
నువ్వేమన్నా మా బాస రాసినవా?
మా యాస రాసినవా?
నీ రాతలకు మా తలరాతలకుపొంతనేది?
మనిషివిక్కడ, మనసక్కడ!
పాలు మర్సిన బిడ్డవైతివి, నీకేమెరుక?
పాల కంటే నీళ్లే పిరెం మాకు
పాలే అడుగుతన్నం మేం
మా శెరలు నీకేమెరక?
నిన్నటి దాకా నీకు ఫయిలు తారీఖుంది
ముసలితనానికి కుసుమ గుడాలన్నయ్
కాటికి కాళ్లు చాపే దాకా
మేం ఈ మడ్లెనే పొర్లాడి పోరాడాలె
మాకు నీళ్లు కావాలె
మా పొలాలకు నీళ్లు కావాలె
వేరు పడటం తప్ప మాకు వేరులేదు
నువ్వేంది చెప్పు తీర్పు చెప్పేది
మేమప్పుడే చెప్పినం
నీళ్ల ముద్దర్లేసినం
మూతి కాడ గడ్డేసి
నీళ్లు తాపించిరి నీకు
నసుగుతవేంది, మాట మర్లేస్తవేంది
మా అసొంటోళ్ల నోరు కొట్టేతందుకు
నీకు పాలు పోసి పెంచుండ్రు
బాసో, యాసో నువ్వు నేర్చుకోవాలిప్పుడు
మాకు గట్టిగింజలు కావాలె, తాలుమాటలొద్దు
-కాసుల ప్రతాప రెడ్డి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications