అర్థవంతం
ఫ్యాను ఆపేయ్
చదవకుండానే
పేజీలు మారుతున్నాయి
ఇప్పుడు మనం
సరిగ్గా మధ్యలో వున్నాం
రాత్రింబవళ్లు చదివి
పుస్తకం పూర్తి చేద్దాం
ఒకడు బతకటానికీ
అదీ ఆరోగ్యంగా బతకటానికీ
అందులో దృఢంగా బతకటానికీ
అదీ గాక అర్థవంతంగా బతకటానికీ
మనసు పెట్టి చదవాల్సి వుంది
ఈ కిటికీ వెల్తురు చాలు
గుమ్మంలోంచి పలకరించే
ఈ పాలగాలి చాలు
కాగితాల్ని ఎగరగొట్టే
ఆ ఫ్యాన్‌ను ఆపేయ్
మనం రాసింది
చూసుకోవాలి
నేర్చుకొన్నది












Click it and Unblock the Notifications
