వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సరిగమపదనిస

నిఖార్సయిన అద్భుతం
అది నీతో ఏమీ ఆశించదు
కాని, అది ఉదయాస్తమయాల్ని
సంగీత రాగాలుగా మార్చేస్తుంది
కథల్ని దృశ్యాలుగా అల్లుతుంది
గాలి కదలికలకు బయల్ని ఒదుగుతుంది
పురా జ్ఞాపకాలను
క్రొంగొత్తగా నీలోకి ఒంపుతుంది
ఏదో ఒక ప్రశాంతమైన రోజు
తటాలున ఓ సంగీత గమకం
దిగంతాల ఆవలి అంచు మీంచి
ఎదిగి వచ్చి నీలో వాలుతుంది
ఇంత వరకే నీ ప్రమేయం
ఇక ఆపై
కూనిరాగంలా మారిన శరీరంతో
ప్రకాశిస్తుంటావు నువ్వు