బైరెడ్డి కృష్ణారెడ్డి కవిత క్రీనీడ

నిట్టూరుస్తున్న
కాంక్షల అలికిడి నువ్వేనని
అపరాత్రి అంధకారంలోనూ
పోల్చుకుంటాను
శివమెత్తిన ఉద్వేగాన్నై
దరిజేరినప్పుడు
నువ్వొక చీత్కార వాక్యానివైతే
నా దప్పిగొన్న దాహానికి
నేనే వెలినవుతాను
ఎడబాటైన నిరీక్షణలు
నీ కనుపాపలు కబురంపే
పిలుపుల బాహువులై
నన్నల్లుకుపోతే
పారవశ్యపు డోలికల్లో
సేద తీరుతున్న
ఉద్విగ్నాన్నవుతాను
నీ ఒడినై ఓలలాడుతున్నప్పుడు
మోహబాసలు
ఊసులాడే స్వేదాగ్నిలో
అంతర్థానమై
నీ అంతరంగపు స్తన్యాన్ని గ్రోలే
శిశువునై జన్మిస్తాను












Click it and Unblock the Notifications