స్పర్శ (తెలుగు కవిత)

గర్భంలో
నన్ను నేనే పాతేసుకున్న
నక్షత్ర బీజాన్ని
నువ్వు తరువై తడిమి
పుప్పొడుల కుసుమించిన
వెలుగురేఖను
మేఘమైన ఆకాశపు
మునివాకిటిలో
నన్ను నేనే పారేసుకున్న
వరదగూడును
నువ్వు కిరణమై సోకి
ఏడు రంగుల వర్షించిన
తెల్లదనాన్ని
ఇప్పుడు నేనొక
నన్ను నేనే ఆకృతీకరించుకుంటున్న
అక్షర చిత్రాన్ని
నీ కనుపాపనై దర్శించకపోతే
మర్మం అంతు చిక్కదు
ఇప్పుడు నేనొక
నన్ను నేనే సరిచేసుకుంటున్న
కవన తంత్రిని
నీ మునివేలునై స్పర్శించకపోతే
నాదం ఘోష తెలువదు
- బైరెడ్డి కృష్ణారెడ్డి












Click it and Unblock the Notifications