లోపలి బయలు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆకాశాన్ని తాకాలని ఆశపడి
భంగపడ్డ దిగులుతో మౌనమైన
కారునలుపు కొండ
చెక్కని శిలాఫలకం రీతిగ
నిటారుగా ఒక వేపున

కాలం నొసలు మీద
ఆవిరైపోతున్న చెమట బిందువుల్ని
క్షణాలు క్షణాలుగా పొట్టన పెట్టుకొని
ఆటుపోట్లను ఆవులిస్తున్న
గర్జనల అలలు ఇంకొక వేపున

జోలపాడి నిద్రబుచ్చిన సందెమాపు
ఆత్రంగ అప్పుడే మేల్కొన్నదేమని
సింధూరం పులుముకున్న
ప్రశ్నార్థకం మాదిరిగ నడుమన
పొద్దుపొడుపు ఉలికిపాటు

బతుకు నడిజాము వాకిట
అలిసిపోయిన అస్తిత్వపు దేహం
గడియ తీసిన బయళ్ళ పెయిమీదికి
ఉదయ కాలపు నడక

అస్తిత్వపు దేహం నీడను పోలిన
వారసత్వం రూపమొకటి
నడుస్తున్న దారి వెంట
అడుగులు కలుపుతున్న అలికిడి

నీడ వెనుక నీడ కనుచూపుమేరలో
రొండు పేలికలైన కలిసి నడచిన బాట

కుంగిపోనున్న పొద్దులోనికి
కనుమరుగవుతున్న చీలిపోయిన బాటలో
చేజారిపోతున్నదేదో దేవులాడుకోవాలని
వెను దిరిగిన ఆక్రందన

దేవులాట సడిని పసిగట్టనొల్లని
వారసత్వపు నడక
చాచిన చేతులకు దక్కని
దిగ్మండలం వేపు ఒంటిగా

-బైరెడ్డి కృష్ణారెడ్డి

ఈ తెలుగు కవితకు కవి స్వయంగా చేసిన ఆంగ్లానువాదం కింద చదవండి.

 Baireddy Krishna Reddy's poem The Inside Out

The Inside Out

Despaired by the task of reaching sky-heights,
wearing a melancholy-silence countenance,
like a memorial sans inscriptions
the jet black mountain straight on one side

Swallowing the vapours of sweat
vanishing on the brow of Time
unit by unit, minute by minute,
and yawning in and out the ebbs and the flows
the waves of roars on another side

The dawning sun in between
like violet-masked wondrous exclamation,
as if the nightfall lulled to sleep early eve
has woken soon in hours wee
violating the waking schedule-etiquette

The body-frame housing this exist
long fatigued through the mid of life
out on to the back of the unlocked
pasture-threshold lush spreading wide
for a morning walk-routine

The footfalls of the posterity's frame
replicating the shadow of this exist's frame
walking in the footprints close behind
along the pathway of the morning walk

Shadow behind shadow moving thus,
at a stone throw distance close at hand
the walking pathway runs into two
for something visibly slipping away
from the arms extended to hold in tact
into the split up pathway
vanishing into the downing sun

The posterity's body-frame,
inclined not to sense
the craving search's saddened trace,
speeding all alone
toward the horizon way

-Baireddy Krishna Reddy

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Baireddy Krshna reddy in his poem The Inside Out depits the inner feelings of him

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి