
రంగుల శకలాలు, కొన్ని మెరుపులూ, కొన్ని చురకలూ- స్నిప్పెట్స్
ముందుగా స్నిపెట్స్ సమూహానికి శుభాకాంక్షలు, ఒకదశనుంచి మరో దశకి వెళ్ళేందుకు మనం ప్రతీ చోటా కొన్ని చిన్న అడుగులు వేయాల్సి ఉంటుంది. అత్యద్బుతంగా పరుగు తీసే రన్నర్ కూడా మామూలుగా ఉండే రోడ్డుమీద నెమ్మదిగా నడవాల్సిందే అలాగే... కొన్ని స్పార్క్ లని పూర్తి స్థాయి కవిత్వంగా చెప్పే అవకాశం ఉండదు... ఆ ప్రయత్నంలో పుట్టినవే ఈ మినీ కవితా పద్దతులు.., గాలీబ్ లాంటి కవులు కూడా ఇలాంటి షార్ట్ అండ్ షాట్ పద్దతిని వాడారు... అయితే ఇలా ఇక్కడే ఆగకుండా ఈ స్నిప్పెట్స్ ని పూర్తిస్థాయి కవితలుగా మార్చే ప్రయత్నం చేయటం కూడా మంచిదే...
ఇలా ఈ భాధ్యతని నామీద పెట్టిన నరేష్ తాను తప్పుకున్నాడు గానీ కనీసం రెండున్నరగంటలు మీ స్నిప్పెట్స్ లో కొన్నింటిని ఎంపిక చేయటానికిపట్టింది.. ఈ వారనికి గానూ నాకు నచ్చినవీ, లేదా నేను చూడగలిగిన వాటిలో బావున్నయి అనిపించినవీ ఇవి. అంతమాత్రాన నేను కోట్ చేయని వారివి బాగాలేవని కాదు. అయితే వారికవిత్వంలో కొంత చిక్కదనం పెరగాల్సి ఉండటమూ, ఎంపిక చేయటానికి మరీ ఎక్కువ స్నిప్పెట్స్ తీసుకునే చాన్స్ లేకపోవటమూ అడ్డంకిగా మారింది...

కంచర్ల శ్రీనివాస్
మొదట నన్ను ఆకర్శించింది కంచర్ల శ్రీనివాస్ స్నిప్పెట్.. ఔను దేశం అంటే మట్టికాదు, అలాగని పూర్తిగా మనుషులూ కాదు, నిజానికి మట్టిలేని మనుషులెక్కడ? అందుకే దేశాన్ని మళ్ళీ మళ్ళీ ప్రక్షాళన అంటూ లేనిపోని భావజాలాలని ప్రజలమీద రుద్దే ప్రయత్నాన్ని దెబ్బకొట్టిన ఈ వాక్యాలు నచ్చాయి.
పూల
కుండీ
కాదు
దేశం
మట్టి
తరచూ
మార్చటానికి.

కాకరపర్తి పద్మజ
కనురెప్పలు... కలలకూ, కన్నీటికీ, ఆశకూ, ఆనందనికీ ప్రతీ ఫీలింగ్ కీ ముందు స్పందించేది కళ్ళే., ఇక్కడ కవయిత్రి భాద విరహవేదనా అనుకోవచ్చూ లేదా ఒక నేస్తం కోసం పడే వేదనా కావచ్చు "కన్నీటి కప్పం కట్టడం అంటే పాత భాదకు మూల్యాన్ని చెల్లించటం అన్నట్టే...
రెప్పల
గడపలో
కాటుక
రాణి
సొగసు
రాజుకు
కన్నీటి
కప్పం
కడుతూ..!!

పుట్టి గిరిధర్
ఇదైతే ఇక నేనేం చెప్పగలనూ?? అనిపించిన స్నిపెట్... ఒక్కొక్క హత్యా భారత దేశం లో కల్లోలాన్ని రేపుతుందేమో అన్న నా భయాన్ని అక్షరం చావులేనిదీ అన్న భావం తో నాలో ధైర్యాన్ని నింపాడీ కవి... ఇతనికి శుభాకాంక్షలు...
అక్షరాల
చెట్టును
కూల్చేసారు
విత్తనాలను
నరికెయ్యలేరుగా!

బన్నీ నాగ్
గౌరీ లంకేష్ హత్యకు స్పందించిన ఒక బలమైన వేదనాపూరిత వాక్యం ఇది.... ఈ కవి ఇదివరకు రాసాడో లేదో తెలియడు గానీ భావుకత్వాన్ని మించిన ఆవేశం, ఆవేదనా కనిపించాయి.
వాళ్ళు
దాహంతో
నీళ్ళడిగారు
మీరు
నెత్తురునిచ్చారు.

అనూరాధ బండి
చందస్సూ దేనికి మాత్రం ఉందీ? ఒక క్రమపద్దతిని దాటి అడ్డుగోడలని బద్దలు కొట్టాలనుకున్న విప్లవకారుడే కావచ్చూ, మరీ ఉన్మద స్తితికి చేరిన హంతకుడూ కావచ్చు .., ఆవేశానికి ఒక క్రమమైన బందనాలుందవనీ చెప్పినట్టూ అనిపించింది... లేదా స్త్రీ యొక్క నేలసరి వేదన గురించి కూడా అయివుండవచ్చు. మిగతా స్నిపెట్స్ కూదా ఈ కవయిత్రి రాసినవి చూసినప్పుదు ఒక స్పార్క్ ఉంది... కొంత ప్రాక్టీస్ అవసరం...
రక్తప్రవాహ భాషకు.. చందస్సుండదంటుందామె

భాగ్య సుధ
మరో అక్షర నివాళి.. గౌరీ లంకేష్ మరణం గత కాలం కంటే బలమైన మార్పునే కలిగించిందనటానికి ఇదో ఉదాహరణ..
నేలకు
రక్తపు
ముగ్గులు
సత్యానికి
తూటాల
ముద్దులు

సునితా చొల్లేటి
ఎంత చక్కని భావుకథ... భావ కవిత్వం లో ఇలాంటి పోలికలు సర్వసాధారనమే అయినా పెరటి గంగాళం అనటం ఇక్కడ ఆమె జీవిన తత్వాన్ని, అనవసర ఊహలు కాకుండా వాస్తవికత లోనే జీవించాలనే కోరికనీ బయట పెట్టింది...
చందమామ
జారి
పడింది
మా
పెరటి
గంగాళం
లో.....

వడ్లమూడి దుర్గాంబ
నిజమే
కదా..!
పసిపాప
నవ్వుని
మించిన
స్వర్గం
ఏముందనీ..,
ఏ
కారనమూ
లేకుందాకూడా
నవ్వగలిగిన
ఆ
పసితనమెంత
అద్బుతం...
ఈ
కవయిత్రి
రాసినవి
ఎక్కువగా
కనిపించలేదు
గానీ
రాసినవి
బావున్నాయి.
స్వర్గం
అంటే...
ఒక్క
పువ్వూ
రాలని
ఏ
పాపా
ఏడ్వని
లోకం

మెర్సీ మార్గరేట్
ఇక
ఇక్కడ
నేనేం
చెప్పగలను...
ఇప్పుదున్న
సాహిత్య
సమూహం
లో
ఈ
అమ్మాయి
స్థానం
నేను
చెప్పాల్సిన
అవసరమూలేదు....
ఈ
ఒక్క
స్నిప్పెట్
కీ
"మెర్సీ
మార్గరెట్"
అన్న
మాట
తప్ప
ఇంకేమీ
చెప్పే
సాహసం
చెయ్యటం
లేదు
ఆమె
ముఖంపై
చారలు
మాట్లాడితే
కాలం
చరిత్ర
కత్తి
పట్టుకు
వెనక్కెళ్తుంది

రఘు మందాటి
ఈ పేరు విన్నప్పుడు నాకు రొట్టమాకురేవే గురొచ్చింది... రఘు అక్కడ తీసిన అందమైన ఫొటోలవల్ల అయిఉండవచ్చు. ఇతని కొన్ని కవితలు చదివినట్టు గుర్తు.. ఎప్పుడు రాలుతుందా అక్షరం? కవి బలమైన కోరికతో తల్చుకుంటే చాలదా...
రాయాల్సిన
అక్షరం,
కలం
కొసన
ఇంకా
రెక్కలనాడిస్తూ.

గరికపాటి మణిందర్
ఏమౌతుందీ??? కలలవెంట పరుగు అయితే శిఖరాగ్రానికీ చేర్చొచ్చు లేదా.... ఆచరణ సాధ్యం కాని కలవెంటపడితే జీవితం పాతాళానికి పడిపోనూ వచ్చు. గుర్తెరిగి సాగిపో అంటూ చెప్పిన ఈ స్నిప్పెత్ కూడా నాకు నచ్చింది..
కలల
ఎరీనాపై
జీవితం
పరుగు
మెడల్
సాధిస్తుందో
మెడ
విరగ్గొట్టుకుంటుందో.........
గరికపాటి
మణిందర్