1 కాదు.. 3: భూమికి పొంచివున్న పెను ముప్పు: ఏ ఒక్కటి ఢీ కొట్టినా.. సర్వం సమాప్తం
Asterods near Earth: విశ్వాంతరాల్లో గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు సర్వసాధారణమే. అవి దారి తప్పి దిశా తెన్నూ లేకుండా తిరుగాడుతుంటాయి. గతంలో అనేక అస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలో దూసుకెళ్లిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. అస్టరాయిడ్ 2024 వైఆర్ 4, ఆస్టరాయిడ్ 535844 (2015 బీవై 310) ఈ కోవకు చెందినవే.
2032లో భూమిని ఢీ కొట్టడానికి 3.1 శాతం అవకాశాలు ఉన్నాయని గతంలో వెల్లడించింది నాసా. ఆ తరువాత దాన్ని సవరించింది. ఈ గ్రహ శకలం భూమిని ఢీ కొట్టడానికి గల అంచనాల శాతాన్ని 0.004 శాతానికి కుదించింది. ఆస్టరాయిడ్ 535844 (2015 బీవై 310)పైనా అలాంటి అంచనాలే వేసింది నాసా.

ఇప్పుడు తాజాగా మూడు గ్రహ శకలాలు భూమికి ప్రమాదకరంగా మారినట్లు అంతరిక్ష పరిశోధకులు అంచనా వేశారు. ఈ మూడింట్లో ఏ ఒక్కటయినా భవిష్యత్తులో భూమిపై ఉత్పాతాన్ని సృష్టించే అవకాశాలను కొట్టిపారేయట్లేదు. బ్రెజిల్ లోకి సావో పొలో స్టేట్ యూనివర్శిటీ సైంటిస్టులు వీటి కదలికలను గుర్తించారు.
వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్ లో ప్రచురించారు. ఈ మూడు గ్రహ శికలాలు- 2020 ఎస్ బీ, 524522, 2002 సీఎల్- 1, ప్రస్తుతం ఈ మూడు కూడా మన భూమికి పొరుగునే ఉన్న శుక్ర గ్రహం పరిధిలో సంచరిస్తోన్నాయి. సూర్యుడికి అతి సమీపంలో ఉండటం వల్ల టెలిస్కోప్ లకు అందట్లేదని సావో పొలో స్టేట్ యూనివర్శిటీ వెలేరియో కర్రుబా తెలిపారు.
వాటి ప్రస్తుత గమనం- శుక్ర గ్రహానికి అతి సమీపంలో ఉంటోంది. గురుత్వాకర్షణలో ఏ చిన్న తేడా వచ్చినా.. మరుక్షణమే అవి భూమి వైపు తమ దిశను మార్చుకోగలవు. దీనివల్ల విపత్కర పరిణామాలు సంభవించవచ్చని వెలేరియో ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవేళ- ఈ మూడింట్లో ఏ ఒక్కటియినా భూమిని ఢీ కొట్టిందంటే- దాని తాకిడికి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం గల బిలం ఏర్పడుతుందని, హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే మిలియన్ రెట్లు అధికంగా శక్తి ఉత్పన్నమౌతుందని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఆయా అస్టరాయిడ్ల కదలికపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. వీటిని కో-ఆర్బిటర్ అస్టరాయిడ్స్ గా గుర్తించినట్లు తెలిపింది.
ప్రస్తుతం ఈ అస్టరాయిడ్లు.. శుక్రుడి గురుత్వాకర్షణకు లోనై ఉన్నాయని, సూర్యుడి నుంచి వెలువడే కాస్మిక్ బ్లైండ్ స్పాట్స్, సౌర తుఫాన్ల వంటివి.. వాటి మార్గాన్ని నిర్దేశిస్తాయని ది డెయిలీ గెలాక్సీ వెల్లడించింది. ఫలితంగా అవి భూమికి మరింత ప్రమాదకరంగా మారినట్లు వివరించింది. సూర్యుడిపై సంభవించే విస్ఫోటనాలకు అవి ప్రభావితం కాగలిగితే భూమి వైపు దూసుకు రావడం తథ్యమని పేర్కొంది.
చిలీలోని రూబిన్ స్పేస్ అబ్జర్వేటరీ సైంటిస్టులు కూడా ఇలాంటి ఆందోళననే వ్యక్తం చేశారు. కాస్మిక్ బ్లైండ్ స్పాట్ వల్ల ఆ గ్రహ శకలాల కదలికలను అనుక్షణం గుర్తించడం కష్టతరమౌతోందని, చివరి నిమిషం వరకూ వాటిని గుర్తించడం సులభం కాదని పేర్కొన్నారు. ఇతర గ్రహ శకలాల కంటే ఇలాంటి అస్టరాయిడ్ల వల్ల భూమికి ముప్పు అధికమని స్పష్టం చేశారు.
రెండు నుండి నాలుగు వారాల ముందు వరకు మాత్రమే వాటిని భూమిపై నుంచి స్పష్టంగా గుర్తించగలమని వివరించారు. శుక్రుడి పరిశోధనల కోసమే ప్రత్యేకంగా చేపట్టిన అంతరిక్ష మిషన్ ద్వారా మాత్రమే ఈ ప్రమాదకర గ్రహశకలాలను సమర్థవంతంగా గుర్తించగలమని తేల్చి చెప్పారు.
అతి ప్రాచీన అంతరిక్ష శిలలు/గ్రహ శకలాలు- గ్రహాల పరిణామం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు వెసలుబాటు కల్పిస్తుంది. నియర్- ఎర్త్ అబ్జెక్ట్స్ కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం కూడా అంతరిక్ష పరిశోధనల్లో కీలకం. భవిష్యత్తులో అవి భూమిని ఢీ కొట్టడానికి గల అవకాశాల గురించి తెలుసుకోవడానికి దోహదపడతాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications