ఒక్కసారి నూనె పోస్తే 40 గంటలు వెలుగుతుంది..ఈ మట్టి ప్రమిద స్పెషాలిటీ ఇదే..!!

పండుగలైనా,పూజలైనా ఇంట్లో దీపం వెలిగించడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం.ముఖ్యంగా మట్టి ప్రమిదలో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.అయితే దీపం వెలిగించిన కొద్దిసేపటికే నూనె అయిపోవడంమళ్లీ నింపాల్సి రావడం సాధారణంగా ఎదురయ్యే సమస్య. కానీ ఈ సమస్యకు ఒక సంప్రదాయ కుమ్మరి కళాకారుడు వినూత్నమైన పరిష్కారం చూపించారు.విద్యుత్తు అవసరం లేదు..బ్యాటరీతో పనిలేదు..ఎలాంటి ఆధునిక యంత్రాల సహాయమూ లేదు.కేవలం మట్టితో తయారుచేసిన ఒక ప్రత్యేక ప్రమిదలో ఒక్కసారి నూనె నింపితే ఏకంగా 24 నుంచి 40 గంటల పాటు దీపం నిరంతరాయంగా వెలుగుతుంది.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అశోక్ చక్రధారి రూపొందించిన ఈ 'మ్యాజిక్ మట్టి ప్రమిద'ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గాలి ఒత్తిడిగురుత్వాకర్షణతో పనిచేసే ప్రమిద

ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ కుమ్మరి కళాకారుడు అశోక్ చక్రధారి ఈ వినూత్న ప్రమిదను రూపొందించారు.దీని నిర్మాణం వెనుక భౌతిక శాస్త్రంలోని గాలి ఒత్తిడి గురుత్వాకర్షణ సూత్రాలు ఉన్నాయి.ప్రమిద పైభాగంలో నూనె నిల్వ ఉండేందుకు ప్రత్యేక మట్టి పాత్రను అమర్చారు.కింద ఉన్న ప్రమిదలో నూనె కాలుతూ తగ్గినప్పుడు పై పాత్ర నుంచి అవసరమైనంత నూనె స్వయంచాలకంగా కిందకు చేరుతుంది.నూనె మట్టం తగిన స్థాయికి చేరగానే ప్రవాహం ఆగిపోతుంది.దీంతో నూనె వృథా కాకుండా వత్తికి నిరంతరాయంగా నూనె అందుతుంది. ఫలితంగా దీపం ఎక్కువ సమయం పాటు వెలుగుతుంది.

a-clay-lamp-that-keeps-burning-for-40-hours-this-potter-ashok-chakradhari-innovation-is-going-viral

యూట్యూబ్ వీడియో నుంచి వినూత్న ఆవిష్కరణ వరకు

ఈ ఆలోచన అశోక్‌కు 2019 ప్రాంతంలో వచ్చింది.యూట్యూబ్‌లో ద్రవాలను ఆటోమేటిక్‌గా నింపే పాతకాలపు పరికరానికి సంబంధించిన వీడియోను చూసిన ఆయన అదే తరహా సాంకేతికతను మట్టితోనే రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ప్లాస్టిక్ లోహాలు ఉపయోగించకుండా పూర్తిగా పర్యావరణ హితమైన ప్రమిదను తయారుచేయాలనే లక్ష్యంతో ప్రయోగాలు ప్రారంభించారు.నెలల తరబడి చేసిన ప్రయత్నాల తర్వాత ప్రత్యేకమైన మట్టి పాత్రను రూపొందించడంలో విజయం సాధించారు.

2020లో ఈ ప్రమిదకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది ఆర్డర్లు వచ్చాయి.తాజాగా లింక్డ్‌ఇన్,ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ప్రమిదకు సంబంధించిన వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

100 గంటలు వెలిగే అడ్వాన్స్‌డ్ ప్రమిద
వినియోగదారుల నుంచి వచ్చిన ఆదరణతో అశోక్ చక్రధారి తన ఆవిష్కరణను మరింత అభివృద్ధి చేశారు.ఏకంగా 100 గంటలకు పైగా నిరంతరాయంగా వెలిగే అడ్వాన్స్‌డ్ మ్యాజిక్ ప్రమిదను కూడా తయారుచేశారు.ఈ ఆవిష్కరణ ఆయనకే కాకుండా కొండగావ్ ప్రాంతంలోని ఇతర కుమ్మరి కుటుంబాలకు కూడా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.

సంప్రదాయంగా వస్తున్న కుమ్మరి కళకు శాస్త్రీయ ఆలోచనను జోడిస్తే ఎంతటి అద్భుతాలు సృష్టించవచ్చో అశోక్ చక్రధారి నిరూపించారు.ఆధునిక సాంకేతికత అంటే ఖరీదైన యంత్రాలే అవసరం లేదనిమన సంప్రదాయ నైపుణ్యానికి కొత్త ఆలోచన తోడైతే చాలు అని ఈ మట్టి ప్రమిద చాటిచెబుతోంది.ఒక చిన్న మట్టి దీపం వెనుక ఇంతటి విజ్ఞానంఉపాధి అవకాశాలు దాగి ఉండటం నిజంగా విశేషమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+