శబరిమలకు TGSRTC ప్రత్యేక బస్సులు, వీరికి ప్రత్యేక రాయితీలు..!!

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమల అయ్యప్ప స్వామి మండల, మకర విలక్కు పూజల మహోత్సవాల కాలం ప్రారంభమవుతున్నవేళ తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల కు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేకాధికార క్యారేజ్ బస్సుల బుకింగ్స్‌పై భక్తులకు, గురుస్వాములకు ఆర్టీసీ అనేక రకాల రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు.

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. అయ్యప్ప స్వాముల యాత్ర సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ నెల 16వ తేదీ నుంచి డిసెంబరు 27వ తేదీ వరకు మండల పూజకు వెళ్లే భక్తుల కోసం, అలాగే డిసెంబరు 30వ తేదీ నుంచి నూతన సంవత్సరం జనవరి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా.. ఆర్టీసీ బస్సు బుక్‌ చేసే గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ బస్సులను బుక్‌ చేసిన గురుస్వామికి ఒక బస్సులో ఉచిత ప్రయాణంతోపాటు, మిగిలిన బస్సుల్లో ఒక్కో బస్సుకు రోజుకు రూ.350 చొప్పున కమిషన్‌ చెల్లించనున్నారు.

ఒంటి పూట బడులు.. ఐటీ వర్క్ ఫ్రం హోం - ఎల్‌నినో, నీటి కొరత తో..!!
ఒంటి పూట బడులు.. ఐటీ వర్క్ ఫ్రం హోం - ఎల్‌నినో, నీటి కొరత తో..!!
tgsrtc-to-operate-special-buses-for-sabarimala-ayyappa-devotees-here-the-details

ప్రత్యేక రాయితీలు అమలు

అదే విధంగా ప్రతీ బస్సులో ఇద్దరు వంట వారికి, 10 సంవత్సరాలలోపు ఇద్దరు మణికంఠలకు, ఒక లగేజీ అటెండెంట్‌కు సీట్లు కేటాయించకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. మరిన్ని వివరాల కోసం 040-66440000, 040-23450033లో సంప్రదించవచ్చని ఆర్టీసీ అధికారులు సూచించారు. కాగా.. ఈసారి ఆర్టీసీ బస్సులలో వెళ్లే భక్తులకు మరో ప్రయోజనం చేకూరింది. శబరిమలకు రాకపోకలు సాగించే టీజీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులకు కేరళ ప్రభుత్వం బోర్డర్ టాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భక్తులపై అదనపు ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం నిర్వహించే ప్రధాన పూజా సమయాల కు అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ ఈ బస్సులను నడపనుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+