AP MPTC, ZPTC పోలింగ్ వేళ కీలక పరిణామాలు, పులివెందుల.. గన్నవరంలో...!!
ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. బరిలో మొత్తం 21,012 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. పోలింగ్ ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పులివెందుల నియోజకవర్గంలో పరిషత్ పంచాయితీ ఇప్పట్ల, పార్నపల్లె, తుమ్మలపల్లె గ్రామాల్లో కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఏజెంట్ లను బయటకు పంపేశారంటూ వైసీపీ ఆరోపించింది. దీంతో, పార్నపల్లెకు వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అనుమతించలేదు. అనుమతి ఉన్న ఒక్కక్కరిని మాత్రమే అనుమతిస్తున్నామ ని పోలీసులు స్పష్టం చేసారు. సున్నిత ప్రాంతం కావడంతో అవినాష్ రెడ్డిని బూత్వైపు అనుమ తించని పోలీసులు.. బందోబస్తు ఏర్పాటు చేసారు.

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీలు
గన్నవరం నియోజకవర్గంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా.. జమ్మలమడుగులోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దమడియం మండలం గుండ్లకుంటలో గొడవ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కూటమి ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి వైసీపీ నేతలు పంపించేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో టీడీపీ కార్యకర్తలపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ముగ్గురికి గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. మురసు తుఫాన్ ప్రభావంతో ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది. ఈ ప్రాంతాల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు.













Click it and Unblock the Notifications
