తెలంగాణకు కేంద్రం తీపికబురు..రూ. 3892కోట్ల భారీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక అండదండలు అందిస్తోంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రంలో రూ.3,892 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం నవంబర్ 3న ఢిల్లీలో జరిగిన నాలుగో నేషనల్ ఎపెక్స్ కమిటీ సమావేశంలో తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం రూ.873.49 కోట్ల సహాయం అందించనుంది.

ఇప్పటివరకు యూసీఎఫ్ కింద తెలంగాణకు మొత్తం ఎనిమిది ప్రాజెక్టులకు ఆమోదం లభించి, వాటి విలువ రూ.9,573 కోట్లకు చేరుకుంది. ఈ విధానంలో కేంద్రం 20 నుంచి 25 శాతం వరకు భరించగా, రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా సమకూరుస్తుంది. మిగిలిన మొత్తాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టనున్నాయి.

Telangana urban projects Centre Approves Rs 3 892 Crore for Under Urban Challenge Fund

దీనివల్ల ప్రభుత్వంపై పూర్తి ఆర్థిక భారం పడకుండా భారీ పనులు చేపట్టే అవకాశం ఏర్పడుతోంది.ఐదు ప్రాజెక్టుల్లో అతిపెద్దది హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి గోదావరి తాగునీటి సరఫరా పథకం రెండో, మూడో దశలు. దీనికి రూ.1,992 కోట్లు కేటాయించారు. ఘన్‌పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల వరకు దాదాపు 120 కిలోమీటర్ల పైప్‌లైన్లు వేయనున్నారు. 120 ఎమ్ఎల్‌డి, 70 ఎమ్ఎల్‌డి సామర్థ్యంతో రెండు నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు.

ఇప్పటికే మొదటి దశతో కలిపి ఈ పథకం ద్వారా 20 టీఎంసీ నీరు అదనంగా అందుతుంది. 2035 వరకు దాదాపు 1.74 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఇటీవల బయటి రింగ్ రోడ్ చుట్టూ విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలు కూడా ఈ ప్రయోజనం పొందనున్నాయి.వరంగల్ నగరానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమగ్ర వరదనీటి నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుకు రూ.1,465 కోట్లు మంజూరయ్యాయి.

వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించనున్నారు. 24 క్రానిక్ ఫ్లడ్ పాయింట్లను పరిష్కరించేలా ఆర్‌సిసి, మట్టి డ్రైన్లు నిర్మించనున్నారు. పది ప్రధాన చెరువుల బంధాలను బలోపేతం చేయడంతోపాటు స్పాంజ్ సిటీ కాన్సెప్ట్, సహజ ఆధారిత పరిష్కారాలు కూడా చేర్చనున్నారు. దీనివల్ల వరంగల్‌లో వరద ముప్పు గణనీయంగా తగ్గనుంది.

చారిత్రక వరంగల్ కోట కందకం పునరుద్ధరణ, అభివృద్ధికి రూ.209.08 కోట్లు కేటాయించారు. కాకతీయుల కాలం నాటి ఈ కందకాన్ని పూర్వవైభవంతో తీర్చిదిద్ది పర్యాటక ఆకర్షణగా మార్చనున్నారు. హనుమకొండ సెంట్రల్ బస్ డిపో నిర్మాణానికి రూ.168.80 కోట్లు మంజూరయ్యాయి. ఆధునిక రవాణా సదుపాయాలు, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా ఈ ప్రాజెక్టు రూపొందించారు.

తెలంగాణాకు వర్ష హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, చలి దెబ్బ కూడా!
తెలంగాణాకు వర్ష హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, చలి దెబ్బ కూడా!

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.57.50 కోట్లు కేటాయించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదోది అయిన ఈ ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.గత మే నెలలో జరిగిన తొలి సమావేశంలో వరంగల్ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు రూ.4,674 కోట్లు, కరీంనగర్ పార్కులు-చెరువుల అభివృద్ధికి రూ.840 కోట్లు, ఖమ్మం ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ కేంద్రానికి రూ.160 కోట్లు ఇప్పటికే ఆమోదం లభించాయి. తాజా ఐదు ప్రాజెక్టులతో కలిపి తెలంగాణ పట్టణాలు మరింత ఆధునికంగా, ప్రజలకు అనుకూలంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+