పగలు, రాత్రి సమయాలు బరాబర్: ఉత్తరార్థగోళంలో..

ఖగోళ శాస్త్రంలో అత్యంత కీలకమైన మార్పులకు వేదికగా నిలిచే ఆటమ్ ఈక్వినాక్స్ (Autumn Equinox) బుధవారం సంభవించనుంది. ఈ ఖగోళ అద్భుతం.. ఉత్తరార్ధగోళంలో శరత్కాలపు ప్రారంభానికి సూచికగా భావిస్తారు. ఈ నిర్దుష్ట సమయంలో సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా, నిట్టనిలువుగా ఉంటాడు. దీనివల్ల భూమిపై పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఒక రోజులో ఏర్పడే ప్రక్రియ కాదిది. భూభ్రమణ కక్ష్యలో ఖచ్చిత క్షణంలో చోటుచేసుకునే ఓ అద్భుత మార్పు.

లాటిన్ భాషలో 'ఈక్వస్' అంటే సమానం అని అర్థం. అలాగే.. 'నాక్స్' అంటే రాత్రి. ఈ రెండు అర్థవంతమైన పదాల కలయికతోనే 'ఈక్వినాక్స్' ఏర్పడింది. ప్రతి ఏడాది మార్చి, సెప్టెంబర్ లల్లో రెండుసార్లు ఈ ప్రక్రియ సంభవిస్తుంటుంది. ఈ నెల 23 తర్వాత ఉత్తరార్ధగోళంలో పగటి సమయం క్రమంగా తగ్గుతూ, రాత్రి సమయం పెరుగుతుంటుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో రుతువులు పూర్తిగా భిన్నంగా మారిపోతాయి. ఇక్కడ వసంతకాలం ప్రారంభమవుతుంది.

Autumn Equinox is an important event marks beginning astronomical autumn in the Northern Hemisphere

ఈ ఈక్వినాక్స్ శరత్కాల విషువత్తు ప్రకృతి సమతుల్యత, భూమి నిరంతర చలనాన్ని చాటిచెప్పే ఓ అద్భుత సృష్టి నియమం. ఇది మన దైనందిన జీవితాల్లో పగటి వెలుతురును తగ్గిస్తూ, చలికాలాన్ని పరిణామాలను స్వాగతిస్తుంది. ఈ అద్భుతమైన ఈక్వినాక్స్ ప్రక్రియ సంభవించడానికి గల ఖచ్చితమైన తేదీలలో ప్రతి సంవత్సరం స్వల్ప మార్పులు సర్వసాధారణం. సాధారణంగా ఇది 22 లేదా 23 తేదీలలో సంభవిస్తుంటుంది. అరుదైన సందర్భాల్లో సెప్టెంబర్ 21 లేదా 24న కూడా రావొచ్చు.

టీ20ల్లో టీమిండియా రేర్ ఫీట్: మొట్టమొదటి జట్టు మనదే బాస్
టీ20ల్లో టీమిండియా రేర్ ఫీట్: మొట్టమొదటి జట్టు మనదే బాస్

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం సుమారు 365.25 రోజులు కాగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మనం 365 రోజులను లెక్కిస్తాం. ఈ తేడా వల్లే ప్రతి సంవత్సరం ఈ ఈక్వినాక్స్ సంభవించే సమయంలో మార్పు కనిపిస్తుంది.

శరత్కాలం సంభవించడానికి ప్రధాన కారణం.. భూమి తన కక్ష్యకు సుమారు 23.5 డిగ్రీల అక్షంలో వంగి ఉండటమే. భూమి సూర్యుని చుట్టూ వార్షిక భ్రమణాన్ని పూర్తి చేసే క్రమంలో ఈ వంపు కారణంగా భూమిపై సూర్యకిరణాలు పడే తీవ్రత, కోణం నిరంతరం మారుతుంటాయి. దీనివల్లే మనకు విభిన్న రుతువులు ఏర్పడుతుంటాయి. ఈక్వినాక్స్ రోజున భూమిలోని ఏ అర్ధగోళం కూడా సూర్యుని వైపు ఎక్కువగా వంగి ఉండదు. దీనివల్ల సూర్యరశ్మి రెండు అర్ధగోళాలకూ సమానంగా అందుతుంది.

మొబైల్ కంపెనీల దోపిడీకి చెక్: ఇకపై రీఛార్జ్ ప్లాన్.. విత్ అవుట్ ఇంటర్నెట్: తాజా గైడ్ లైన్స్
మొబైల్ కంపెనీల దోపిడీకి చెక్: ఇకపై రీఛార్జ్ ప్లాన్.. విత్ అవుట్ ఇంటర్నెట్: తాజా గైడ్ లైన్స్

సూర్యుడు ఉత్తరార్ధగోళం నుండి దక్షిణార్ధగోళానికి ప్రయాణించే క్రమంలో భూమధ్యరేఖను దాటేటప్పుడు ఈక్వినాక్స్ సమయం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. దీని తర్వాత భూమి సూర్యునికి మరింత దూరంగా జరగడం వల్ల కాలాలు మారవు. భూమి అక్షం వంపు, సూర్యకాంతి పడే కోణంలో సంభవించే వల్ల మాత్రమే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఉత్తరార్ధగోళం.. చలికాలం వైపు అడుగులు వేస్తే.. దక్షిణార్ధగోళంలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి.

ఆ కేంద్రమంత్రి అవుట్: యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల నగారా: పోలింగ్, కౌంటింగ్
ఆ కేంద్రమంత్రి అవుట్: యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల నగారా: పోలింగ్, కౌంటింగ్

ఈక్వినాక్స్ రోజున పగలు, రాత్రి సమయాలు ఖచ్చితంగా 12 గంటల చొప్పున సమానంగా ఉంటాయని సాధారణంగా భావిస్తారు గానీ శాస్త్రీయంగా పరిశీలిస్తే ఇది పూర్తిగా నిజం కాదు. సముద్ర మట్టం వద్ద ఉండే వాతావరణ వక్రీభవనం కారణంగా సూర్యోదయం కంటే ముందే సూర్యకిరణాలు క్షితిజంపై కనిపిస్తాయి. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా కాసేపు వెలుతురు ఉంటుంది. దీనివల్ల పగటి సమయం రాత్రితో పోలిస్తే కొన్ని నిమిషాలు ఎక్కువగా రికార్డవుతుంది.

శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు శరత్కాలాన్ని అధ్యయనం చేయడానికి రెండు విభిన్న పద్ధతులను అనుసరిస్తారు. ఖగోళ శరత్కాలం (Astronomical Autumn) అనేది సెప్టెంబర్ ఈక్వినాక్స్ తో ప్రారంభమై డిసెంబర్ వింటర్ సోలిస్టిస్ తో ముగుస్తుంది. వాతావరణ శరత్కాలం (Meteorological Autumn) మాత్రం సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభమై నవంబర్ 30తో ముగుస్తుంది. వాతావరణ మార్పులను సులభంగా విశ్లేషించడానికి వీలుగా మూడు నెలల కాలాన్ని లెక్కిస్తారు.

ఆటమ్ ఈక్వినాక్స్ కాలాల మార్పులకే పరిమితం కాకుండా భూఅయస్కాంత క్షేత్రంలోనూ అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో సౌర గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల ధ్రువ ప్రాంతాలలో రాత్రి వేళల్లో ఆకాశంలో అద్భుతమైన రంగుల వెలుగులు విరజిమ్మే అరోరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+