Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నింగి నుంచి నేలకు- 7 నిమిషాల బ్లాక్ అవుట్

ISRO: అంతరిక్షంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో మొట్టమొదటిసారిగా మానవ సహిత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇది పరిపూర్ణంగా విజయవంతమైంది. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కొద్దిసేపటి కిందటే భూమికి చేరుకుంది. పసిఫిక్ మహా సముద్రంలో ల్యాండ్ అయింది.

అంతకుముందు ఏడు నిమిషాల పాటు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. ఇది కొంత టెన్షన్ పెట్టినా.. ఆ తరువాత పరిస్థితి సర్దుకుంది. భూకక్ష్యలోకి ప్రవేశించిన మరుక్షణమే కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ తొలగిపోయింది. స్పేస్ ఎక్స్ కు చెందిన గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు ఏర్పరచుకోగలిగింది.

Axiom-4 Mission Shubhanshu Shukla s Dragon spacecraft back to earth splash down into the Pacific Ocean

ఆక్సిమ్ 4 పేరుతో ఇస్రో.. ఈ మిషన్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్ కు భారత్ సారథ్యాన్ని వహించింది. వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. ఈ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఆయనతో పాటు స్లావోష్ ఉజ్నాన్స్ కీ, టిబోర్ కపు- హంగేరి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్ తో కూడిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ స్పేస్ క్రాఫ్ట్ లో కిందటి నెల 26వ తేదీన ఐఎస్ఎస్ కు బయలుదేరిన విషయం తెలిసిందే.

ఆ మరుసటి రోజే ఇది ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది. ఈ మేరకు డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు అప్పట్లో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. నలుగురు వ్యోమగాములు ఇంకాస్సేపట్లో ఐఎస్ఎస్ లో అడుగు పెట్టినట్లు తెలిపింది. 18 రోజుల పాటు శుభాన్షు శుక్లా టీమ్ ఐఎస్ఎస్ లో గడిపింది.

ఈ క్రమంలో మొత్తం ఏడు అంశాలపై పరిశోధనలు సాగించింది. ఈడిబుల్ మైక్రొయాలజీ, స్ప్రౌట్స్, మజిల్ రీజనరేషన్, టర్డిగ్రేడ్స్, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే, సైనో బ్యాక్టీరియా, ఫుడ్ క్రాప్ సీడ్స్.. పై ఈ పరిశోధనలు కొనసాగాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇస్రో త్వరలో వెల్లడించనుంది.

18 రోజుల ఈ స్టడీ అనంతరం శుభాంశు శుక్లా సహా ఇతర వ్యోమగాములతో కూడిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కొద్దిసేపటి కిందటే అమెరికా శాన్ డియాగో సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. మొత్తం 16 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. శుభాన్షు శుక్లా టీమ్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది.

ఈ స్ప్లాష్ డౌన్ ప్రక్రియ మొత్తాన్ని కూడా శుభాన్షు శుక్లా తల్లిదండ్రులు, భార్య తిలకించారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే వారిలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది భారతీయుల కలలను శుభాన్షు శుక్లా, ఆయన టీమ్ సాకారం చేసిందని అన్నారు. దేశ అంతరిక్ష పరిశోధనల్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+