బిగ్గెస్ట్ డేటా లీక్.. సైబర్ నేరగాళ్ల చేతికి 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం డిజిటల్ యుగానికి తగ్గట్టు ప్రజలు సైతం అప్డేట్ అవుతున్న తరుణంలో.. సైబర్ నేరగాళ్లు సైతం మరింత అప్డేట్ అవుతుండడం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు పలు మార్లు డేటా లీక్ ఘటనలు చోటు చేసుకోగా.. ఇప్పుడు తాజాగా జరిగిన ఘటన ప్రపంచాన్ని మరింత కలవరపెడుతోంది.
ప్రపంచంలోని అగ్రగామి టెక్ సంస్థలు అయిన యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, గిట్‌హబ్, టెలిగ్రామ్ సహా ప్రభుత్వ వెబ్‌సైట్లకు చెందిన 16 బిలియన్లకు పైగా యూజర్ల లాగిన్ వివరాలు లీక్ అయినట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. ఫోర్బ్స్ జూన్ 2025లో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఇది ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద డేటా లీక్ ఘటనగా చెబుతున్నారు. కాగా సైబర్ భద్రతా పరిశోధకులు 30 పెద్ద డేటా సెట్‌లను గుర్తించారు. వీటిలో ఒక్కొక్కటిలో 3.5 బిలియన్ల రికార్డులు ఉండటం గమనార్హం.

ఈ డేటా లీక్‌లో Google, Apple, Facebook వంటి దిగ్గజ కంపెనీలతో పాటు.. VPN లాగిన్‌లు, కార్పొరేట్ డెవలపర్ ప్లాట్ ఫారమ్‌లు, ఈ మెయిల్, సోషల్ మీడియా ఖాతాలు, క్రిప్టో వాలెట్లు సహా
మొదలైన ఎన్నో సున్నితమైన అకౌంట్ల వివరాలు బయటపడ్డాయని స్పష్టం అవుతోంది. 2025 ప్రారంభం నుంచి యాక్టివ్‌గా ఉన్న లాగిన్ వివరాలు కూడా ఈ లీక్‌లో ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ భయంకరమైన సైబర్ దాడుల నేపథ్యంలో గూగుల్, తమ వినియోగదారులకు పాత పాస్‌వర్డ్ ఆధారిత లాగిన్ విధానాన్ని మానేసి, పాస్‌కీల్స్ ఉపయోగించాలని సూచిస్తోంది. పాస్‌కీలు అనేవి బయోమెట్రిక్ ఆధారిత (వేలిముద్ర, ముఖ స్కాన్) సిస్టమ్‌ల ద్వారా యాక్సెస్ చేసే పద్ధతులు. ఇవి ఫిషింగ్ రెసిస్టెంట్ (తప్పుదారి పట్టించే వెబ్‌సైట్ల నుంచి రక్షణ కలిగించే) విధానంగా ఉండి, హ్యాకింగ్‌కు తక్కువ అవకాశం ఇస్తాయని అంటున్నారు.
మరోవైపు యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా వినియోగదారుల భద్రతను పెంపొందించేందుకు Two-Factor Authentication, యూజర్ అలర్టింగ్ సిస్టమ్‌లు, రియల్ టైమ్ మానిటరింగ్ టూల్స్ వంటి వాటిని బలోపేతం చేస్తున్నాయి. ఈ లీక్ నేపథ్యంలో ప్రతి ఇంటర్నెట్ వినియోగదారుడు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. యూజర్లు పాత పాస్‌వర్డ్‌లు తక్షణమే మార్చాలని.. ప్రతి అకౌంట్ కోసం వేర్వేరు పాస్‌వర్డ్‌లు వాడాలని తెలిపాయి.
టూ-స్టెప్ వెరిఫికేషన్ (2FA) తప్పనిసరిగా ఆన్ చేయాలని.. పబ్లిక్ Wi-Fi లలో సెన్సిటివ్ డేటా ఎంటర్ చేయకుండా ఉండాలని వివరించాయి. ఈ ఊహించని ఘటన ఒక వేకప్ కాల్ లాంటిదని.. సాంకేతికతను ఉపయోగించుకోవడమే కాకుండా దానిని ఎలా సురక్షితంగా వాడాలి అన్నది కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని బహిర్గతం అవుతోంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications