Brahmos missile: బ్రహ్మోస్ క్షిపణికి భారీ డిమాండ్.. ఈ ఏడాది మెగా ఒప్పందం!

Brahmos missile: భారత్ కు చెందిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి మాయజాలం అనేక దేశాలను ఆకట్టుకుంటోంది. యూఏఈ, సౌదీ అరేబియా, వియత్నాం, ఈజిప్ట్, ఇండోనేషియా వంటి దేశాలు ఈ అధునాతన క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బ్రహ్మోస్ కొనుగోలుకు ఫిలిప్పీన్స్ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసింది. ఈ క్షిపణుల డెలివరీ కూడా గత సంవత్సరం ప్రారంభమైంది. ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణించే ప్రపంచంలోని ఏకైక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. కానీ మరో దేశంతో చర్చలు చివరి దశలో ఉన్నాయి. రక్షణ రంగ వర్గాల ప్రకారం ఈ ఒప్పందం చాలా సున్నితమైనది. కాబట్టి చర్చలు చివరి దశలో ఉన్న దేశం పేరును రహస్యంగా ఉంచినట్లు "ది ప్రింట్" నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం ఈ ఒప్పందం చాలా పెద్దది కావడంతో పాటు చాలా ముఖ్యమైనది. ఒప్పందం చివరి దశలో ఉన్న బ్రహ్మోస్ మిస్సైల్ వెర్షన్ భూమి నుంచి ప్రయోగించే వెర్షన్ అని తెలిసింది.

బ్రహ్మోస్ కొనుగోలుకు చర్చలు
బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఈజిప్ట్, వియత్నాం దేశాలు కూడా చర్చలు జరుపుతున్నాయి. ఈ క్షిపణి ల్యాండ్ వెర్షన్ పై మధ్యప్రాచ్య దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇండోనేషియాతో ఒప్పందం ప్రారంభ దశలోనే ఉందని ది ప్రింట్ తెలిపింది. గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందానికి సంబంధించి రెండు దేశాల మధ్య చర్చలు ఊపందుకుంటాయని భావించారు. ఇదిలా ఉండగా.. భారత్ గత సంవత్సరం ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులను సరఫరా చేయడం ప్రారంభించింది. ఈ క్షిపణిని కొనుగోలు చేసిన మొట్టమొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. ఆ తర్వాత వియత్నాం కూడా కొనుగోలు ఒప్పందం చేసుకుంది.

BrahMos Missile Surge in Demand Mega Deal Expected This Year
బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు
బ్రహ్మోస్ క్షిపణిని భారత్ రష్యా సహకారంతో అభివృద్ధి చేసింది. ఇది ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో శత్రు లక్ష్యాలను దాడి చేయగలదు. ఈ క్షిపణిని భూమి, సముద్రం, ఆకాశం నుంచి ఈ మిస్సైల్ ను ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి నేవీ, ఆర్మీ, వైమానిక దళాలు ప్రయోగించవచ్చు. ఇది ఓడలపై కూడా దాడి చేయగలదు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందింది. ఇది భారతదేశానికి చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవో మిషినోస్ట్రోయెనియాలు సంయుక్తంగా తయారు చేశాయి. భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి దీని పేరు వచ్చింది. ఈ క్షిపణి శత్రు రాడార్లను ఛేదించగలదు. ఈ క్షిపణి 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు.

.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+