Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

China News: పొరుగు దేశం చైనాలో రోబోల రాజ్యం.. ఆ రంగాన్ని శాసిస్తున్నది మనుషులు కాదు మరమనుషులు..

Robots farming: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదిగితేనే భవిష్యత్తు ఉంటుందని పొరుగుదేశం చైనా ఎప్పుడో గుర్తించింది. గతంలో ప్రపంచ కర్మాగారంగా పేరుతెచ్చుకున్న డ్రాగన్ కంట్రీ.. అన్ని విషయాల్లో స్వయం సమృద్ధి సాధించే విధంగా ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయంలో వినూత్న పద్దతులను ప్రవేశపెడుతూ అధిక రాబడి కోసం ప్రయత్నాలు చేస్తోంది. కేవలం పరిశోధనలతో కాలయాపన చేయకుండా అమలు చేస్తోంది కూడా.

చైనాలోని ప్రముఖ నగరం షాంఘై చుట్టుపక్కల వ్యవసాయం విరివిగా సాగుతోంది. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు చాలా కాలంగా పశువులు మరియు నాగలిని పొలం పనులకు వినియోగించేవారు. సేద్యంలో గణనీయమైన మార్పును సూచిస్తూ ప్రస్తుతం రోబోలతో పంటలు పండిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. సాంప్రదాయక పశువుల స్థానంలో ఇంజనీర్లచే ఈ రోబోట్లు నిర్వహించబడుతున్నాయి.

China using robots in farming more than machinery

ఇంజనీర్‌లు ఒక కంట్రోలర్‌ను పట్టుకుని వ్యవసాయ రోబోట్‌కు ఖచ్చితత్వంతో మార్గనిర్దేశం చేస్తున్నారు. వరి ప్రధాన పంటగా 70 మందికి పైగా ఇంజనీర్‌లు అక్కడ ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం. గత 7 సంవత్సరాలుగా వారు ఈ తరహా రోబోట్స్ పరిశోధన మరియు అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నారు. ఫలితంగా 60 రకాల వ్యవసాయ రోబోట్‌లు.. పంట నాట్లు నుంచి కోత వరకు వివిధ రకాల పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

ఇలా రోబోట్‌లను సమర్థవంతంగా పనిచేసేలా చేసేందుకు ఇంజనీర్లు కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నారు. ఈ AI ఆపరేటింగ్ సిస్టమ్ వాటి కదలికలను ప్లాన్ చేయడానికి మెదడుగా పనిచేస్తుంది. రైతులు కేవలం తమ మొబైల్ ఫోన్‌లలో వీచాట్ మినీ ప్రోగ్రామ్ ద్వారా సిస్టమ్‌కి లాగిన్ అయి రోబోట్‌లను స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందని వ్యవసాయ సహకార విభాగం హెడ్ వాంగ్ జిన్యు తెలిపారు.

గతానికి భిన్నంగా నేడు వ్యవసాయ పనుల్లో రోబోల వినియోగం ఎక్కువవుతోంది. ఎందుకంటే అవి సమర్ధవంతంగా, ఖచ్చితత్వంతో మరియు అవిశ్రాంతంగా పనిచేస్తాయని వాంగ్ చెబుతున్నారు. 5G, ఇమేజ్ రికగ్నిషన్ మరియు బిగ్ డేటా వంటి సాంకేతికతల ద్వారా సెకన్లలోనే వేగంగా ఆయా వ్యవసాయ పనులను పూర్తిచేస్తాయన్నారు. గడ్డి మరియు పంటల మధ్య తేడాను సమర్థవంతంగా గుర్తించడమే కాకుండా, కలుపు మొక్కలను ఖచ్చితంగా తొలగించడానికి ప్రత్యేకమైన బ్లేడ్‌లకు మార్గనిర్దేశం కూడా చేయగలవని వెల్లడించారు. ఒక గంట ఛార్జ్‌తో కలుపు తీసే రోబో 8 గంటల పాటు పనిచేయగలదని వివరించారు.

అక్కడి ఓ ఆటోమేటెడ్ వెజిటబుల్ ఫామ్‌లో ఆకు కూరలు పండించే మొత్తం ప్రక్రియ మానవ రహిత పద్ధతిలో కొనసాగుతుండటం విశేషం. సుమారు 13 హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయల పెంపకానికి కేవలం ఐదుగురు రైతులు మాత్రమే అవసరం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయంతో శాస్త్ర సాంకేతికతను ఏకీకృతం చేసేందుకు పరిశోధనలను తీవ్రతరం చేయాలని చైనా పిలుపునిచ్చింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం పంటల సాగులో యాంత్రీకరణ రేటు 73 శాతానికి చేరుకుదంటే రోబోటిక్స్, AI వంటి టెక్నాలజీలను చైనా ఎంత విరివిగా వాడుతుందో అర్థం చేసుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+