TRAI new rules: మొబైల్ యూజర్లకు ఓ గుడ్ మరో బ్యాడ్ న్యూస్.. మరో రెండు రోజుల్లో అవి పూర్తిగా బ్లాక్
OTP News: ఇటీవల టెలికాం రంగంలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రజలకు ఉపశమనం కలిగించేవి కాగా మరికొన్ని వారి నడ్డి విరిచేవిగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు మరో కొత్త భారీ మార్పుకు ప్రజలు సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది. అయితే ఇది మాత్రం ప్రజల మేలు కోసం ఉద్దేశించినదేనని TRAI చెబుతోంది.
టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రిలయన్స్ కస్టమర్లు వన్ టైం పాస్‌వర్డ్ (OTP) పొందడంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్పామ్ మెసేజ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రూపొందించిన కొత్త ట్రేసబిలిటీ రూల్స్‌ను టెలికాం సంస్థలు అమలు చేయాల్సి ఉంది. ఇందుకు చివరి తేదీని డిసెంబర్ 1, 2024గా నిర్ణయించింది.

కొత్త నిబంధనల ప్రకారం మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి OTPలతో సహా అన్ని వాణిజ్య సందేశాల మూలాన్ని టెలికాం ఆపరేటర్లు గుర్తించాల్సి ఉంటుంది. తద్వారా హానికరమైన కమ్యూనికేషన్‌లను నిరోధిస్తూ, వినియోగదారులను మోసాల నుండి రక్షించవచ్చు. గడువు తేదీలోగా దీన్ని పాటించడంలో విఫలమైతే బ్యాంకింగ్, ఇ-కామర్స్ మరియు సోషల్ మీడియా వంటి ముఖ్యమైన సేవలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే OTPలు మొబైల్స్‌ను చేరేందుకు జాప్యం జరగవచ్చు లేదా పూర్తిగా బ్లాకేజ్ ఏర్పడవచ్చు.
స్పామ్ మరియు ఫిషింగ్ మెసేజ్‌ల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ట్రాయ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఓ కొత్త ఫ్రేమ్ వర్క్‌ను వాచ్ డాగ్ రూపొందించింది. ఆయా టెల్కోలు దాన్ని అనుసరించాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే పలుమార్లు తేదీని పొడిగించడా చివరికి డిసెంబరు 1ని గడువు తేదీగా గతంలోనే ప్రకటించింది.
దశలవారీగా ట్రాయ్ ఈ కాలక్రమాన్ని అమలు చేస్తోంది. చైన్ డిక్లరేషన్ అవసరాలను పాటించడంలో విఫలమైన సంస్థలకు నవంబర్ 30 వరకు ఆపరేటర్లు రోజువారీ హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ 1 నుంచి నిబంధనలు పాటించని ఎంటిటీల నుంచి వచ్చే సందేశాలు పూర్తిగా బ్లాక్ చేయబడతాయి. దీర్ఘకాలంలో వినియోగదారుల భద్రతను ఈ రూల్స్ మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications