Oppo Reno 15 Pro Mini ఫీచర్స్ లీక్.. ఇండియాలో లాంఛ్ ఎప్పుడంటే ??
మార్కెట్ లో రోజుకో కొత్త ఫోన్ లాంఛ్ అవుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఫోన్స్ లాంఛ్ చేస్తున్నారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ "ఒప్పో" ఇండియన్ మార్కెట్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. లేటెస్ట్ గా తమ రెనో సిరీస్‌లో 'రెనో 15 ప్రో మినీ' పేరుతో ఓ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను సిద్ధం చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించి గతంలో లీక్‌లు వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించి స్పెసిఫికేషన్లతో పాటు.. ఇది త్వరలో భారతదేశంలోకి రానుందని సూచించారు.
ఈ ఫోన్ 2025 డిసెంబర్ చివరిలో లేదా 2026 జనవరిలో భారత మార్కెట్లోకి రావచ్చని అంచనా వేశారు. రెనో 15 ప్రో మినీ మోడల్ నంబర్ CPH2813 కాగా.. ఇది MediaTek Dimensity 8450 ప్రాసెసర్‌తో ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 6.32-అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్ప్లేను, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని వెల్లడించారు. ఇది మెరుగైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని లీక్‌లు సూచిస్తున్నాయి. ఇందులో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్.. 3.5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది.
అలానే ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా IP69 రేటింగ్‌తో ఇది నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంటుందని ధృవీకరించారు. ఇది ఫోన్ మన్నికను పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మునుపటి నివేదిక ప్రకారం.. రెనో 15 ప్రో మినీ గ్లేసియర్ వైట్ రంగులో ప్రత్యేకమైన రిబ్బన్-స్టైల్ ఫినిషింగ్‌తో వస్తుంది. దీని బరువు సుమారు 187 గ్రాములు, మందం 7.99 మి.మీ. అయితే, దీని విడుదలపై ఒప్పో నుండి అధికారిక ధృవీకరణ ఇంకా లేదు. కానీ, భవిష్యత్తులో కంపెనీ నుండి దీనిపై ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications