Super El Nino:వాతావరణంలో పెను మార్పులు - పొంచి ఉన్న ప్రమాదం..?

ప్రస్తుత వేసవి కాలంలో ఎండల తీవ్రతను చూస్తుంటే అందరి నోటా వినిపిస్తున్న మాట 'ఎల్‌నినో'.అసలు ప్రకృతిలో సంభవించే ఈ మార్పులకు,మన వాతావరణానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉండబోతోంది?

భూగోళం వేడెక్కుతున్న కొద్దీ వాతావరణ మార్పులు వింత వింత రూపాలు దాల్చుతున్నాయి.సాధారణంగా వచ్చే ఎల్‌నినో కంటే ఈసారి 'సూపర్ ఎల్‌నినో'పొంచి ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది గాలిని వేడెక్కించడమే కాకుండా,వర్షపాతాన్ని కూడా అస్తవ్యస్తం చేసే శక్తిని కలిగి ఉంటుంది.

super-el-nino-explained-why-india-may-face-heatwaves-drought-in-2026-impact-on-telugu-states

ఎల్‌నినో అంటే ఏమిటి? ఇది ఎందుకొస్తుంది?

పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడాన్ని 'ఎల్‌నినో'అంటారు.సాధారణంగా పసిఫిక్ సముద్రంలో తూర్పు నుండి పడమరకు వీచే గాలులు (Trade Winds),సముద్రం మీది వేడి నీటిని ఇండోనేషియా వైపు నెడతాయి.అయితే,ఈ గాలులు బలహీనపడినప్పుడు,ఆ వేడి నీరు తిరిగి దక్షిణ అమెరికా వైపు (పెరూ దేశం వైపు) మళ్లుతుంది.దీనివల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది.

ఎల్‌నినో vs సూపర్ ఎల్‌నినో: వ్యత్యాసం ఏమిటి?

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5°C నుండి 1.5°C పెరిగితే దాన్ని ఎల్‌నినో అంటారు.ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.0°C లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని 'సూపర్ ఎల్‌నినో'గా పరిగణిస్తారు. ఇది సంభవించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఎండలు, తీవ్రమైన కరువు కాటకాలు లేదా ఊహించని వరదలు వచ్చే అవకాశం ఉంటుంది.

Super El Nino: రుతుపవనాల విఫలం, 1997లో ఏమైందో గుర్తుందిగా?
Super El Nino: రుతుపవనాల విఫలం, 1997లో ఏమైందో గుర్తుందిగా?

భారత్‌‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం

భారతదేశ రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది.ఎల్‌నినో వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి.దీనివల్ల దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయి.ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడమే కాకుండా,సాగు నీటికి ఎద్దడి ఏర్పడవచ్చు.కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంటుంది.

భారత వ్యవసాయ రంగం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం వ్యవసాయ భూమిలో కేవలం 35శాతం మాత్రమే నీటి పారుదల పై ఆధారపడితే.. మిగతా 65శాతం పూర్తిగా వర్షపాతం పై ఆధారపడుతుంది. ఎల్‌నినో వచ్చినప్పుడు నైరుతి రుతుపవనాల వర్షపాతం తగ్గుతుంది.రుతుపవనాల ప్రారంభం ఆలస్యమవుతుంది.పొడి వర్షాలు పెరుగుతాయి.ఖరీఫీ పంటలైన వరి, వేరుశనగ, పప్పుధాన్యాలకు నష్టం సంభవించే ఆస్కారం ఉంది.నీటి జలాశయాల నీటిమట్టం తగ్గి తాగునీటి సమస్య తలెత్తుతుంది. వేసవి వేడి తీవ్రంగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎల్‌నినో వల్ల ముఖ్యంగా ప్రభావితమయ్యే ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.IMD హైదరాబాద్ కేంద్రం డేటా ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982, 1987, 2002, 2004, 2009, 2014 సంవత్సరాల్లో కరువులు నమోదయ్యాయి.

Uranium లేకపోతే భారత్ భవిష్యత్తు చీకట్లోనే!
Uranium లేకపోతే భారత్ భవిష్యత్తు చీకట్లోనే!

నష్టపోయే ప్రాంతాలు ఇవే..

  • రాయలసీమ - పరిస్థితులు మరీ తీవ్రంగా ఉంటాయి.
  • తెలంగాణ ఉత్తర జిల్లాలు - 1982 మాదిరి 49 శాతం వర్షలోపం రావచ్చు.
  • కోస్తా ఆంధ్ర - వర్షపాతం 36 శాతం తక్కువ కావచ్చు.

ముంచెత్తే సమస్యలు

  • వ్యవసాయ ఉత్పత్తి తగ్గి, ఆహార ధరలు పెరగవచ్చు.
  • కృష్ణా, గోదావరి నదుల నీటి స్థాయులు తగ్గవచ్చు.
  • నీటి తగాదాలు రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమవ్వవచ్చు.
  • ఉష్ణప్రభంజనాలు (Heat Waves) పెరగవచ్చు - గతంలో AP, తెలంగాణ అత్యంత హీట్‌వేవ్ మరణాలు నమోదు చేసిన రాష్ట్రాలు.

గతంలో ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాలు
1900 నుండి 2024 వరకు కనీసం 30 ఎల్‌నినో సంఘటనలు నమోదయ్యాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

సంవత్సరం తీవ్రత ముఖ్య ప్రభావాలు
1972-73 సూపర్ పెరూ మత్స్య పరిశ్రమ నాశనం, ప్రపంచ వ్యవసాయ నష్టం
1982-83 సూపర్ భారత్‌లో కరువు, ఇండోనేషియాలో అడవి మంటలు
1997-98 సూపర్ (చరిత్రలో బలమైనది) రికార్డ్ వేడి, ప్రపంచవ్యాప్త విపత్తులు, భారత్‌లో సాధారణ వర్షాలు
2002-03 మధ్యస్థం భారత్‌లో కరువు, AP, తెలంగాణలో వర్షలోపం
2009-10 మధ్యస్థం భారత్‌లో 6 అత్యంత తీవ్రమైన కరువులలో ఒకటి
2015-16 సూపర్ ప్రపంచ రికార్డ్ వేడి, భారత్‌లో వేసవి వేడి 2500+ మరణాలు
2023-24 బలమైనది లా నినా తర్వాత ఆగిపోయింది
2026-27 (అంచనా) సూపర్ కావచ్చు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) మరియు భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, 2026 ప్రారంభంలో ఎల్‌నినో బలహీనపడి, 'లానినో' (La Niña) పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ లానినో వస్తే భారత్‌లో మంచి వర్షాలు కురుస్తాయి. కానీ, ప్రస్తుత వేసవిలో మాత్రం ఎల్‌నినో ప్రభావం వల్ల వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేకపోవచ్చు కానీ, ముందస్తు జాగ్రత్తలతో నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎల్‌నినో వల్ల వచ్చే కరువును ఎదుర్కోవడానికి నీటి పొదుపు, పంటల ప్రణాళికలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. రాబోయే కాలంలో పర్యావరణ పరిరక్షణే మనల్ని ఇటువంటి 'సూపర్ ఎల్‌నినో'ల నుండి కాపాడే ఏకైక ఆయుధం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+