Koo: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫాం కూ మూసివేత..!
ఇండియాలో తయారు అయ్యే వస్తువులకంటే విదేశాల్లో తయారయ్యే వస్తువులు వాడడానికే కొంత మంది మొగ్గు చూపుతున్నారు. మనం వాడే స్మార్ట్ ఫోన్లన్నీ దాదాపు విదేసీ బ్రాండ్లే.. ఇక మనం వాడే సోషల్ మీడియా యాప్ లు కూడా విదేశాలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. అయితే మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫాం ఎక్స్(ట్విట్టర్)కు పోటీగా దేశీయ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫాం..కూ (koo) తీసుకొచ్చారు. కూను.. ప్రముఖులు, మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు.
అయినప్పటికీ కూ యాప్ వాడేవారు తగ్గిపోయారు. దీంతో ఈ భారతీయ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ 'కూ' ఇప్పుడు నష్టాల్లో కొనసాగుతోంది. దీనిని ఆన్ లైన్ మీడియా సంస్థ డైలీ హంట్ కొనుగోలు చేయాలని భావించినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో నాలుగేళ్ల స్టార్టప్ 'కూ 'సర్వీస్ లను మూసివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. "మేం యాప్ ను కొనసాగించాలని కోరుకుంటున్నాం. కానీ సోషల్మీడియాల యాప్ ను అమలు చేయడానికి టెక్నాలజీ సర్వీస్ ఖర్చు ఎక్కువగా ఉంది. అందుకే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని కో ఫౌండర్స్ రాధాకృష్ణ, మయాంక్ బిదవత్ తెలిపారు.

పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, మీడియా సంస్థలతో పార్టినర్ షిప్ ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. కానీ తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. దీంతో కంపెనీ మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదవత్ కూను 2020లో ప్రారంభించారు. ఇది 10కి పైగా భాషల్లో అందుబాటులో ఉన్న మొట్ట మొదటి భారతీయ మైక్రో బ్లాగిం గ్ సైట్ గా చరిత్ర సృష్టించింది. ఈ యాప్ లోగో పసుపు రంగు గల పక్షిని కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కూ యాప్ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 60 మిలియన్ డౌన్ లోడ్లు పూర్తి చేసుకుంది. యూప్ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల ఖర్చులు ఎక్కువ అవడంతో యాప్ మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ కు చెందిన ఈ యాప్ ను ఆదరించాలని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications