Zomato News: మీడియాకు గట్టిగా ఇచ్చిపడేసిన జొమాటో CEO.. ఫ్యూచర్ డేటెట్ ఫుడ్‌పై క్లారిటీ
Food Safety: ఈమధ్య ఆహార కల్తీ గురించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పెద్ద బ్రాండ్స్ కదా అని నమ్మకంతో చేరదీస్తున్న వినియోగదారులను సైలెంట్‌గా మోసం చేస్తున్నాయి. టెక్నాలజీ అండదండలతో, వినూత్న ఆలోచనలతో అవతరించిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ కూడా వీటిలో ఒకటి అని తేలడం ఒక్కసారిగా కస్టమర్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఈ ఉదంతంపై జొమాటో చీఫ్ X వేదికగా స్పందించారు.
జొమాటోకు చెందిన హైదరాబాద్‌లోని హైపర్ ప్యూర్ గిడ్డంగిపై జరిగిన ఫుడ్ సేఫ్టీ సమస్యపై CEO దీపిందర్ గోయల్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. భవిష్యత్తు తేదీతో లేబుల్ చేయబడిన కూరగాయల ప్యాకెట్లను ఆహార భద్రత అధికారులు కనుగొన్నట్లు ఫిర్యాదులు రావడంతో దాన్ని సరఫరాదారు తప్పిదంగా పేర్కొన్నారు. 90 బటన్ మష్రూమ్ ప్యాకెట్లు తప్పుగా లేబుల్ చేయబడ్డాయని, ఈ విషయానని జొమాటో గిడ్డంగికి చెందిన క్వాలిటీ కంట్రోల్ టీం గుర్తించినట్లు చెప్పారు. సరఫరాదారు టైపింగ్ పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు వివరణ ఇచ్చారు.

ఈ ఘటనతో ఆ సరఫరాదారుని జొమాటో డేటాబేస్ నుండి తొలగించినట్లు ఆయన తెలిపారు. ముష్రూమ్స్ కస్టమర్లకు చేరే ముందే పొరపాటును గుర్తించడంలో కంపెనీ అనుసరిస్తున్న కఠిన మార్గదర్శకాలు మరియు సాంకేతిక వ్యవస్థలు సహాయపడ్డాయని వెల్లడించారు. దీపావళికి ముందు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు జొమాటో హైపర్ ప్యూర్ సదుపాయంలో తనిఖీలు నిర్విహించారు. లేబిలింగ్ సమస్య ఉన్నప్పటికీ అత్యున్నత A+ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.
మీడియా ఈ ఒక్క ఘటనపై దృష్టి సారించడం పట్ల గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలను అప్రతిష్ఠపాలు చేయాలనే ప్రవర్తన తగదన్నారు. గిడ్డంగిలో ఉన్న కోట్ల విలువైన సరుకులను వదిలేసి కేవలం 7 వేల 200 మష్రూమ్ ప్యాకెట్ల గురించి, అదికూడా కస్టమర్లకు సప్లై చేయని వాటిని హైలెట్ చేయడం బాధించిందన్నారు. మేము A+ రేటింగ్ పొందినప్పటికీ ఎందుకు మీడియా దృష్టి ఈ చిన్న అంశంపై పడిందని ప్రశ్నించారు. పెద్ద వ్యాపారాలు చెడ్డవన్న దృఢమైన నమ్మకాన్ని మీడియా ఇష్టపడుతున్నామోనన్నారు.
Hello all - just want to clarify that the fssai team noted that 90 packets of button mushrooms had incorrect packaging date - these were already identified by our warehouse team and were rejected during an inward QC. This is not usual, and was due to a manual typing error on the…
— Deepinder Goyal (@deepigoyal) November 4, 2024
ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం అక్టోబర్ 29న FSSAI అధికారులు 18 కిలోల బటన్ మష్రూమ్ ప్యాకెట్లును అక్టోబర్ 30, 2024 తేదీతో లేబుల్ చేసినట్లు గుర్తించారు. లైసెన్స్ పొందిన హైపర్ప్యూర్ వంటి సదుపాయంలో ఇలా భవిష్యత్తు తేదీ లేబెలింగ్ కలిగిన ఉత్పత్తి ఉండటం ఒక ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన. ఇందుకుతోడు తనిఖీ సమయంలో శుభ్రత సమస్యలు, ఈగలు, కీటక నిరోధ సదుపాయాలు మరియు సిబ్బంది రక్షణ పరికరాలు సరిగ్గా లేవని అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఈ సదుపాయంలో అవసరమైన లైసెన్స్‌లు మరియు సర్టిఫికేషన్లు ఉన్నాయని కనుగొన్నారు.












Click it and Unblock the Notifications