ప్రధాని మోదీని కలిసిన వైభవ్ సూర్య వంశీ.. వైభవ్ కు మోదీ కీలక సూచన..!

14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025 సీజన్ లో గుర్తుండిపోయే పేరు. 14 ఏళ్లకే ఐపీఎల్ లో జర్నీ స్టార్ట్ చేసి.. విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇటు టీమ్ ఇండియా క్రికెటర్లు, సీనియర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పేరు సుపరిచితం.

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఔరా అనిపించాడు. ఐపీఎల్ లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో 7 మ్యాచ్ లు ఆడిన వైభవ్.. 200 పైగా స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు చేశాడు.

14-Year-Old Rajasthan Royals Player Vaibhav Suryavanshi Meets PM Modi

14 ఏళ్లకే విధ్వంసకర బ్యాటింగ్ తో దేశవ్యాప్తంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇటీవల సూర్యవంశీ ప్రతిభను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశంసించారు. సూర్యవంశీకి రూ.10 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. మరోవైపు వచ్చే నెలలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ లో పర్యటించే ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌-19 జట్టులో వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీకి అవకాశం‌‌‌‌‌‌‌ దక్కడం విశేషం.

అయితే తాజాగా వైభవ్ సూర్యవంశీ.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. పాట్నా పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ప్రధాని మోదీ వద్దకు వెళ్లి కలిశాడు. వైభవ్ కుటుంబ సభ్యులతోనూ ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు. ఈ క్రమంలో వైభవ్.. ప్రధాని మోదీ పాదాలు టచ్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు.

ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పాట్నా ఎయిర్ పోర్టులో తాను యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. అతని కుటుంబసభ్యులను కలిశానని పేర్కొన్నారు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీకి క్రికెట్ అభిమానులతోపాటు పలువురు నెటిజెన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ వైభవ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+