National Games 2025: ఉత్తరాఖండ్‌లో ఘనంగా ముగిసిన 38వ జాతీయ క్రీడలు

National Games 2025: ఉత్తరాఖండ్ వేదికగా ఆతిధ్యమిచ్చిన ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలు ఘనంగా ముగిశాయి. ఉత్తరాఖండ్ లోని అంతర్జాతీయ క్రీడా సముదాయం హల్ద్వానీలో జరిగిన 38వ జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి.. ఉత్తరాఖండ్ ను క్రీడా కేంద్రంగా మార్చారని కేంద్ర హోంమంత్రి ప్రశంసించారు. క్రీడలను నిర్వహించడం పట్ల గర్వంగా ఉన్నానని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. ముగింపు వేడుకలో ప్రముఖులను హృదయపూర్వకంగా స్వాగతించారు.

కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. జాతీయ క్రీడలు ఈ రోజు ముగుస్తున్నాయి.. కానీ రాబోయే రోజుల్లో భారత్ ను క్రీడల కేంద్రంగా మార్చే ప్రయాణం ఈ రోజు ప్రారంభమైందన్నారు. క్రీడలల్లో మనం గెలుస్తాం లేదంటే నేర్చుకుంటామన్నారు. మనం అర్జునుడి వంటి యోధుల దేశం నుంచి వచ్చామని ప్రపంచానికి సందేశం పంపాలన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

38th National Games 2025 Successful Conclusion in Uttarakhand
అగ్రస్థానంలో ఉన్న జట్లు ఇవే..
ఈ జాతీయ క్రీడల్లో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అగ్ర స్థానంలో నిలిచింది. 121 పతకాలను ఖాతాలో వేసుకుని తొలి స్థానంలో నిలిచింది. 68 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్ మెడల్స్, 27 బ్రాంజ్ మెడల్స్ ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ క్రీడల్లో టాప్ ర్యాంకులో నిలిచింది. మహారాష్ట్ర 198 పతకాలతో తర్వాతి స్థానంలో నిలిచింది కానీ తక్కవ స్వర్ణాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. హర్యానా 153 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ వరుసగా నాలుగు, 5వ స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మొత్తంగా ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ 12 పతకాలను సాధించింది. 7 పసిడి పతకాలు, ఒక రజతం, 6 కాంస్యాలను ఖాతాలో వేసుకుని 18వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 3 గోల్డ్ మెడల్స్, 3 రజత పతకాలు, 12 కాంస్య పతకాలను సాధించి మొత్తంగా 18 మెడల్స్ అందుకుని 26వ స్థానంతో ముగించింది.

38 జట్లు
ఈ జాతీయ క్రీడలలో 38 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 10,000 మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొన్నారు. హరిద్వార్, నైనిటాల్, హల్ద్వానీ, రుద్రపూర్, శివపురి, న్యూ టెహ్రీ అనే ఆరు నగరాల్లో పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి.

38th National Games 2025 Successful Conclusion in Uttarakhand
జనవరి 28న ప్రధాని చేతుల మీదుగా..
జనవరి 28న డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 38వ జాతీయ క్రీడలను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాన కార్యక్రమాలతో పాటు కలరిప్పయట్టు, యోగాసన, మల్లఖంబ్, రాఫ్టింగ్ వంటి ప్రదర్శన క్రీడలను ఏర్పాటు చేశారు. ఇవి క్రీడా ప్రదర్శనకు సాంస్కృతిక వైవిధ్యాన్ని జోడించాయి.


పాల్గొన్న ప్రముఖ అథ్లెట్లు

ఈ జాతీయ క్రీడల కార్యక్రమంలో ఒలింపిక్ పతక విజేతలు లవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్), స్వప్నిల్ కుసాలే (షూటింగ్), సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్), విజయ్ కుమార్ (షూటింగ్) వంటి ప్రముఖ భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆతిథ్యం
జాతీయ క్రీడలలో పాల్గొనే అథ్లెట్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సురక్షితమైన వాతావరణాన్ని అందించడంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపించింది. భద్రత, ఆరోగ్య సేవలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవసరమైనప్పుడల్లాల సహాయం అందించేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉన్నాయి. క్రీడలు జరిగే వేదికల నుంచి మంచి రవాణా సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ-రిక్షాలు, బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతీయ అభిరుచులకు అనుగుణంగా భోజన సదుపాయాలను కూడా అథ్లెట్ల కోసం ఏర్పాటు చేశారు. అథ్లైట్ల విభిన్న అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అంకితభావం కనబరిచింది. డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఇతర వేదికలలో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో అథ్లెట్లకు సకల సౌకర్యాలు సమకూర్చబడ్డాయి. క్రీడాకారులు విలువైనవారని భావించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. స్థానిక వాలంటీర్లు, క్రీడా సమన్వయకర్తల ప్రమేయం నుంచి వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వరకు అన్నింటిని గొప్పగా నిర్వహించడంతో క్రీడాకారులను నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+